News September 17, 2024

ఏటా ప్రజాపాలన దినోత్సవం.. ఉత్తర్వులు జారీ

image

TG: ప్రతి ఏటా సెప్టెంబర్‌ 17న ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’ నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ గ్రామీణ స్థానిక సంస్థల్లో జాతీయ జెండా ఎగురవేయాలని పేర్కొంది. ఇవాళ HYDలో సీఎం రేవంత్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్, బండి సంజయ్‌లను ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Similar News

News October 10, 2024

టాటా మృతి పట్ల ప్రముఖ వ్యాపారవేత్తల సంతాపం

image

దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వ్యాపారవేత్తలు హర్ష గోయెంకా, ఆనంద్ మహీంద్రా, గౌతమ్ ఆదానీ ట్వీట్లు చేశారు. టాటా ఇకపై లేరన్న విషయాన్ని తాను స్వీకరించలేకపోతున్నానని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దేశం దిశను పునర్నిర్వచించిన గొప్ప వ్యక్తిని భారత్ కోల్పోయిందని అదానీ ట్వీట్ చేశారు. వ్యాపార ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన టాటా ఇక లేరని హర్ష గోయెంకా పేర్కొన్నారు.

News October 10, 2024

రతన్ టాటా మృతి పట్ల కేంద్రమంత్రులు, రాహుల్ సంతాపం

image

దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా మృతి పట్ల కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షా, పియూష్ గోయల్ సంతాపం తెలియజేశారు. ఇండియా ఇండస్ట్రీకి రతన్ టాటా టైటాన్ అని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. టాటా నిజమైన దేశభక్తుడని అమిత్ షా పేర్కొన్నారు. పరిశ్రమలకు రతన్ చేసిన కృషి మన దేశంతో పాటు ప్రపంచంపై చెరగని ముద్ర వేసిందని నడ్డా తెలిపారు. రతన్ కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి రాహుల్ గాంధీ సంతాపం తెలియజేశారు.

News October 10, 2024

ప్రిడేటర్ డ్రోన్స్, అణు సబ్‌మెరైన్ల కొనుగోలుకు సీసీఎస్ ఆమోదం

image

రెండు అణు జలాంతర్గాముల నిర్మాణంతో పాటు 31 ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు PM మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(CCS) ఆమోదం తెలిపింది. సబ్‌మెరైన్లను రూ.40వేల కోట్లతో వైజాగ్‌లో నిర్మించనున్నారు. USకు చెందిన జనరల్ అటామిక్స్ సంస్థ నుంచి డ్రోన్లను కొనుగోలు చేస్తారు. ఇవి వచ్చే నాలుగేళ్లలో దశలవారీగా భారత్‌ చేతికి అందుతాయి. అందులో నేవీకి 15, ఆర్మీ, వాయుసేనకు చెరో 8 డ్రోన్లు కేటాయించారు.