News December 4, 2024

ప్రజల తీర్పు బాధ్యతను పెంచింది: ఫడణవీస్

image

మహారాష్ట్ర ఎన్నికలు చారిత్రకమని ఆ రాష్ట్ర కాబోయే CM ఫడణవీస్ అన్నారు. తనను LP నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపిన ఆయన మాట్లాడుతూ.. తాజా ఎన్నికలు ‘ఏక్ హైతో సేఫ్ హై’ అని స్పష్టం చేశాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నానని, వారి తీర్పు తమ బాధ్యతను పెంచిందన్నారు. హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. రేపు ముంబై ఆజాద్ మైదానంలో ఫడణవీస్ CMగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Similar News

News November 4, 2025

పాపం.. చేయని తప్పుకు 43 ఏళ్లు జైలులోనే!

image

‘వందమంది దోషులు తప్పించుకున్నా.. ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు’ అని చెబుతుంటారు. కానీ చేయని తప్పుకు 43ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు USలోని భారత సంతతి వ్యక్తి సుబ్రహ్మణ్యం వేదం. 1980లో హత్య కేసులో జైలుపాలైన ఆయన ఇటీవలే నిర్దోషిగా రిలీజయ్యారు. అయితే దశాబ్దాల పాత డ్రగ్స్ కేసులో ఇమిగ్రేషన్ అధికారులు మళ్లీ ఆయన్ను అరెస్ట్ చేయడంతో కోర్టు జోక్యం చేసుకుంది. ఈ కేసును నిలిపివేసి ఆయనకు తాత్కాలిక ఊరటనిచ్చింది.

News November 4, 2025

వరి, మొక్కజొన్నలో విత్తనశుద్ధి ఎలా చేయాలి?

image

☛వరి: పొడి విత్తనశుద్ధిలో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండజిమ్ కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. అదే దమ్ము చేసిన నారుమడికైతే లీటరు నీటికి 1 గ్రాము కార్బెండజిమ్ మందు కలిపిన ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి మండె కట్టి నారుమడిలో చల్లాలి.
☛ మొక్కజొన్న: కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ మందుతో విత్తనశుద్ధి చేయడం వల్ల మొదటి దశలో వచ్చే తెగుళ్ల నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకోవచ్చు.

News November 4, 2025

కంపెనీకే 17ఏళ్ల జీవితాన్ని అంకితమిస్తే.. ఉద్యోగి ట్వీట్ వైరల్

image

అవిశ్రాంతంగా 17ఏళ్లు పనిచేసినా లేఆఫ్ ఇవ్వడంతో ఓ ఉద్యోగి చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘లేఆఫ్ బాధలో ఉన్న నేను పిల్లలను తొలిసారి స్కూల్‌కి తీసుకెళ్లా. అప్పుడు వారి నవ్వు చూసి నేను కోల్పోయిన సమయాన్ని గుర్తుచేసుకుంటే కన్నీళ్లు వచ్చాయి. కంపెనీలు త్యాగాలకు కాదు పనితీరుకే విలువనిస్తాయి’ అని రాసుకొచ్చారు. జీతమే ముఖ్యం కాదని, కుటుంబంతో గడిపే సమయం, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని పలువురు సూచిస్తున్నారు.