News September 13, 2024

ప్రభుత్వ వరద సహాయక చర్యలపై ప్రజల సంతృప్తి: పురందీశ్వరి

image

AP: భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి చెప్పారు. వరదల్లో, ఆ తర్వాత ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. విజయవాడలోని కలెక్టరేట్‌లోనే ఉండి CM చంద్రబాబు తీసుకున్న చర్యలు ఆదర్శనీయమని కొనియాడారు. వరద ప్రాంతాలను శుభ్రం చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కృషి చేశారన్నారు. వారిని సన్మానించి, వస్త్రాలను అందించారు.

Similar News

News October 14, 2024

ఇజ్రాయెల్‌కు US అత్యాధునిక ఆయుధాల సాయం

image

ఇరాన్ హెచ్చరిస్తున్నా ఇజ్రాయెల్‌కు సాయం చేయడంలో అమెరికా ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇజ్రాయెల్‌కు అత్యాధునికమైన థాడ్(టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్)బ్యాటరీతో పాటు సైనిక దళాలను కూడా యూఎస్ పంపింది. శత్రు దేశాలు ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను థాడ్ కూల్చేస్తుంది. మరోవైపు తమ ప్రజలు, ప్రయోజనాలు కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది.

News October 14, 2024

BIG ALERT: భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో నేడు ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో 4 రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. మంగళ, బుధ, గురువారాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

News October 14, 2024

ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరించి, గెలిచిన వ్యక్తి సాయిబాబా: నారాయణ

image

TG: అనారోగ్యంతో కన్నుమూసిన ప్రొ.సాయిబాబా పట్ల కేంద్ర వైఖరికి నిరసనగానే నిన్నటి ‘అలయ్ బలయ్‌’లో పాల్గొనలేదని CPI నేత నారాయణ అన్నారు. సాయిబాబా దివ్యాంగుడైనా ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరించి, రాజీలేని పోరాటం చేసి గెలిచారన్నారు. కానీ తన శరీరంతో ఓడిపోయి, ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, తన పోరాటాలతో మనతోనే ఉన్నారని తెలిపారు.