News March 25, 2024

కుప్పంలో చంద్రబాబు పూజలు

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో కుప్పానికి చేరుకున్న ఆయన శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థాన శతరత్న జీర్ణోద్ధారణ ప్రతిష్ఠ మహా కుంభాభిషేకంలో పాల్గొని పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆర్టీసీ బస్టాండు సర్కిల్‌లో జరగనున్న సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. ఇవాళ, రేపు కుప్పంలోనే పర్యటించనున్నారు.

Similar News

News December 6, 2025

పుతిన్ భారత పర్యటనపై చైనా మీడియా ఏమందంటే..?

image

భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనపై చైనా మీడియా స్పందించింది. 2 దేశాలు ఒంటరిగా లేవని ప్రపంచానికి పంపిన సందేశమని ‘గ్లోబల్ టైమ్స్’ చెప్పింది. ‘భారత్, రష్యా తమ సామర్థ్యాలను సొంతంగా, మరింతగా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. 2 దేశాల మధ్య సమన్వయం, సహకారమే ఇందుకు నిదర్శనం. US, వెస్ట్ ఆంక్షలు ఫలించవు’ అని ఫారిన్ అఫైర్స్ వర్సిటీ ప్రొఫెసర్ లీ హైడాంగ్ చెప్పారని తెలిపింది.

News December 6, 2025

30ల్లోకి వచ్చారా..?

image

30ల్లోకి అడుగుపెట్టాక చర్మం నెమ్మదిగా సాగే గుణాన్ని కోల్పోతుంది. కేవలం మాయిశ్చరైజర్ ఈ వయసులో సరిపోదు. యాంటీఆక్సిడెంట్లు ఉన్న ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలి. పగలు ఇ, సి విటమిన్లు, గ్రీన్ టీ ఉన్న ఉత్పత్తులు, రాత్రి రెటినాయిడ్ క్రీములు వాడాలి. ఇవి కొలాజన్ ఉత్పత్తిని పెంచడంతోపాటు చర్మంపై ఏర్పడిన ముడతలు, గీతలను తగ్గిస్తాయి. వీటితో పాటు సన్ స్క్రీన్‌ తప్పనిసరి. ఫేషియల్ ఎక్సర్‌సైజ్‌‌లు చేయడం కూడా మంచిది.

News December 6, 2025

తమిళనాడులో ప్రమాదం.. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు మృతి

image

తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. అర్ధరాత్రి రామనాథపురంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు రామేశ్వరం ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురు మరణించగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు విజయనగరం జిల్లా కొరప కొత్తవలస, మరుపల్లికి చెందినవారిగా గుర్తించారు.