News April 7, 2024

కరెంట్ కట్‌కు పుల్‌స్టాప్

image

ఉప్పల్ స్టేడియానికి సంబంధించిన విద్యుత్ బిల్లు బకాయిల సమస్యకు పుల్‌స్టాప్ పడనుంది. 2015 నుంచి ఉన్న బకాయిలను వాయిదా పద్ధతిలో చెల్లించనున్నట్లు HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు. ఈ మేరకు TSSPDCL CMD ముషారఫ్ ఫరూఖీతో చర్చించినట్లు ఆయన ట్వీట్ చేశారు. విద్యుత్ శాఖకు HCA రూ.1.67 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్న విషయం తెలిసిందే.

Similar News

News March 1, 2025

మిరాకిల్ జరిగితేనే..

image

వర్షం కారణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ రద్దవ్వడంతో అఫ్గానిస్థాన్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతైనట్లే. పాయింట్ల పరంగా దక్షిణాఫ్రికా(3P)తో సమానంగా ఉండగా రేపటి మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో SA భారీ తేడాతో ఓడితేనే అఫ్గాన్‌కు అవకాశాలు ఉంటాయి. సుమారు 200 పరుగుల తేడాతో ENG గెలవాల్సి ఉంది. ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా SA నేరుగా సెమీస్ వెళ్లనుంది.

News February 28, 2025

రోహిత్, షమీ సహా అందరూ ఫిట్: కేఎల్

image

ఫిట్‌నెస్ సమస్యలతో మార్చి 2న కివీస్‌తో మ్యాచ్‌కు <<15595049>>రోహిత్,<<>> షమీ దూరమవుతారన్న వార్తలపై కేఎల్ రాహుల్ స్పందించారు. ‘నాకు తెలిసినంత వరకు ఆటగాళ్లంతా ఫిట్‌గా ఉన్నారు. ఎవరూ మ్యాచ్ మిస్సయ్యే ఛాన్స్ లేదు. అందరూ జిమ్, ప్రాక్టీస్ చేస్తున్నారు. పైగా సెమీస్‌కు ముందు ఒక మ్యాచే ఉన్నందున జట్టులో మార్పులు ఉండకపోవచ్చు’ అని తెలిపారు. కాగా ఇవాళ రోహిత్ గంట పాటు మైదానంలో చెమటోడ్చారు.

News February 28, 2025

రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

image

AP: రాష్ట్రంలో రేపటి నుంచి ఇంటర్ ఫస్టియర్, 3వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు మొదలుకానున్నాయి. 10.58 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉ.9 నుంచి మ.12 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటుచేశారు. అన్ని సెంటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. స్టూడెంట్స్ గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

error: Content is protected !!