News May 24, 2024
పుణే యాక్సిడెంట్.. డబ్బిచ్చి డ్రైవర్ను ఇరికించారా?

పుణేలో ఓ బాలుడు(17) మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మరణానికి కారణమైన ఘటనలో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఆ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ తమ డ్రైవర్కు డబ్బు ఆఫర్ చేసి, కేసు తనపై వేసుకోవాలని బలవంతం చేశారట. అందుకే డ్రైవర్ తానే కారు నడిపానని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు విశాల్పై పోలీసులు సెక్షన్ 201 కింద కేసు నమోదు చేయనున్నారు.
Similar News
News November 28, 2025
2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి: సీఎం

AP: రాజధాని అమరావతికి కేంద్రం రూ.15వేల కోట్లు ఇచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు. బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇలాంటి ఫైనాన్షియల్ సిటీ దేశంలో ఎక్కడా లేదన్నారు. బ్యాంకుల ఏర్పాటు ద్వారా 6541 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. 2028 మార్చికి పూర్తయ్యేలా అమరావతి పనులు సాగుతున్నాయని ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ఎంతగానో సహకరిస్తున్నారని కొనియాడారు.
News November 28, 2025
విమాన వేంకటేశ్వరస్వామి విశిష్టత

తిరుమల గర్భాలయంపై ఉన్న గోపురాన్ని ఆనంద నిలయ విమానం అంటారు. ఈ గోపురంపై కొలువై ఉన్న స్వామివారి రూపమే ‘విమాన వేంకటేశ్వర స్వామి’. విమానం అంటే కొలవడానికి వీలుకాని అపారమైన శక్తి కలిగినది అని అర్థం. ఇది భక్తులకు నేరుగా వైకుంఠవాసుడిని చూసిన అనుభూతినిస్తుంది. ఈ గోపురంలో మొత్తం 60 మంది దేవతా మూర్తులు ఉంటారు. ఈ స్వామిని దర్శించడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 28, 2025
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది: పవన్

AP: కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తోందని Dy.CM పవన్ చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తోందని తెలిపారు. అమరావతిలో బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కార్యాలయాలు ఒకేచోట ఉండటం వల్ల వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా సాగుతాయన్నారు. ఇవాళ్టి కార్యక్రమం భవనాలకే కాకుండా ఏపీ భవిష్యత్తుకు పడిన పునాది అని పేర్కొన్నారు.


