News September 6, 2024
ఆలిండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ఛైర్మన్‌గా పునియా
రెజ్లర్ బజరంగ్ పునియాను ఆలిండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ఛైర్మన్‌గా కాంగ్రెస్ నియమించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. హరియాణాలో త్వరలో ఎన్నికలున్న నేపథ్యంలో వినేశ్ ఫొగట్, పునియా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను ఈరోజు కలిశారు. ఆయన చేతుల మీదుగా ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
Similar News
News October 12, 2024
ఢిల్లీకి పంత్ గుడ్ బై? ట్వీట్ వైరల్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ చేసిన ట్వీట్ సరికొత్త చర్చకు దారితీసింది. ‘ఒకవేళ నేను ఐపీఎల్ వేలంలో పాల్గొంటే ఎవరైనా కొనుగోలు చేస్తారా లేదా? ఎంత ధర పలకవచ్చు?’ అని పంత్ Xలో ప్రశ్నించారు. దీంతో పంత్ ఢిల్లీని వీడుతారా? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఆయనను సీఎస్కే తీసుకుంటుందనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంత్ ట్వీట్ వెనుక ఉద్దేశం ఏంటో తెలియాల్సి ఉంది.
News October 12, 2024
వాటిని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో కలుపుతాం: భట్టి
TG: ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల రాకతో గురుకులాలు మూత పడతాయన్నది అబద్ధమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. చిన్న చిన్న షెడ్లలో ఉన్న వాటిని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో కలుపుతామని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులను తయారు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. అందుకు అనుగుణంగా సిలబస్ తయారు చేసి, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.
News October 12, 2024
BIG ALERT: అతి భారీ వర్షాలు
AP: రాష్ట్రంలో ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ఎల్లుండికి వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరుసటి రోజుకు తీవ్ర తుఫానుగా మారి తమిళనాడులో తీరం దాటవచ్చని పేర్కొంది.