News September 26, 2024
ఆసుపత్రిలో చేరిన పంజాబ్ సీఎం
పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఆసుపత్రిలో చేరారు. ఆయన స్పృహ తప్పి పడిపోయారని, అందుకే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రొటీన్ చెకప్స్ కోసమే ఆయన మొహాలీలోని ఫోర్టిస్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయినట్లు CMO ప్రతినిధులు చెప్పారు. ఆయనకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు.
Similar News
News October 10, 2024
టాటా మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
చిత్తశుద్ధి, నిజాయితీతో ప్రపంచంపై ముద్ర వేసిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో రతన్ టాటా ఒకరని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. పరిశ్రమల అభివృద్ధి, సమాజ సేవలో ఆయన భాగస్వామ్యం తరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. టాటా మరణంతో ఇండస్ట్రీ ఐకాన్‌ను కోల్పోయిందని, ఆయనలాగా ఇంకెవ్వరూ ఉండరని టీజీ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. వాణిజ్య రంగానికి రతన్ టాటా ఆదర్శమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాసుకొచ్చారు.
News October 10, 2024
రతన్ టాటా విజయాలివే..
అనుభవలేమితో కెరీర్ ప్రారంభంలో రతన్ టాటా అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. వాటినే సోపానాలుగా మలుచుకొని ఛైర్మన్ అయ్యాక తనదైన నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా టాటా గ్రూప్‌ను విస్తరించారు. లండన్ టెట్లీ టీ కొనుగోలు, కార్ల తయారీ సంస్థలు జాగ్వార్, ల్యాండ్ రోవర్‌తో పాటు కోరస్ స్టీల్‌ను టాటాలో భాగం చేశారు. దీంతో పాటు ఐటీ, టెలి కమ్యూనికేషన్స్, ఆటో మొబైల్స్ రంగాల్లోనూ సంస్థను విస్తృతం చేసి సక్సెస్ అయ్యారు.
News October 10, 2024
రతన్ టాటా నేపథ్యమిదే..
రతన్ నావల్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో నావల్ టాటా, సోనీ టాటా దంపతులకు జన్మించారు. నాయనమ్మ నవజ్‌బాయ్ పెంపకంలో ఆయన పెరిగారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. రతన్ ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉన్నారు. 1961లో టాటా స్టీల్‌లో ఉద్యోగంలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 1991-2012 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నారు. తన నాయకత్వంలో టాటా గ్రూప్‌లో అనేక సంస్కరణలు చేపట్టారు.