News June 4, 2024
పురందీశ్వరికి లక్ష దాటిన మెజార్టీ
AP: రాజమండ్రి ఎంపీ స్థానంలో పురందీశ్వరి లక్ష ఓట్ల మెజార్టీని దాటారు. ప్రస్తుతం 1,15,566 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అనకాపల్లిలో సీఎం రమేశ్(BJP) 32 వేలు, నర్సాపురంలో శ్రీనివాసవర్మ(BJP) 58 వేల ఓట్ల లీడింగులో ఉన్నారు. ఇక కాకినాడలో జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్‌కు 32,241, మచిలీపట్నంలో బాలశౌరి(జనసేన) 25,364 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
Similar News
News November 13, 2024
బ్రేకప్‌తో కుంగిపోయా: రాశి ఖన్నా
తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయ్యాక ఎంతో కుంగిపోయినట్లు హీరోయిన్ రాశి ఖన్నా తెలిపారు. తాను నటించిన ‘ది సబర్మతి రిపోర్టు’ ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. ‘గతంలో నాకు ఓ లవ్ స్టోరీ ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల అతడితో బ్రేకప్ అయ్యింది. ఆ సమయంలో ఎంతో బాధపడ్డా.. కుంగిపోయా. ఆ తర్వాత ఆ బాధ నుంచి బయటపడి కెరీర్‌పై దృష్టి పెట్టా. ఇప్పుడు నా ఫ్యామిలీ, ఫ్రెండ్సే నాకు అండ’ అని ఆమె చెప్పుకొచ్చారు.
News November 13, 2024
మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ నేతల బస
TG: దమ్ముంటే మూసీ ఒడ్డున బస చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్ నేపథ్యంలో టీబీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 16న 25 మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు బస చేయనున్నారు. ఆరోజు సా.4 గంటల నుంచి మరుసటి రోజు ఉ.8 గంటల వరకు అక్కడే ఉండనున్నారు. కాగా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌లో భాగంగా పరీవాహక ప్రాంతాల ప్రజలను తరలిస్తుండటంపై అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది.
News November 13, 2024
PHOTOS: పెర్త్‌లో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు చేరుకున్న భారత జట్టు పెర్త్ మైదానంలో ప్రాక్టీస్ ఆరంభించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ Xలో పోస్ట్ చేసింది. తొలి టెస్ట్ ఈనెల 22 నుంచి పెర్త్ వేదికగా జరగనుండగా, కెప్టెన్ రోహిత్ శర్మ ఆడతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. హిట్‌మ్యాన్ ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నారు. ఆయన కూడా ఇక్కడ బ్యాటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారని క్రీడా వర్గాలు తెలిపాయి.