News March 19, 2024

ఢిల్లీకి పురందీశ్వరి.. అభ్యర్థుల ఎంపికపై చర్చ

image

AP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి ఢిల్లీకి వెళ్లారు. TDP-JSPతో పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ సీట్లలో ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను అధిష్ఠానానికి అందించనున్నారు. అలాగే పొత్తుపై విమర్శలు చేస్తూ పలువురు బీజేపీ రాష్ట్ర నేతలు రాసిన లేఖపైనా సమాలోచనలు చేస్తారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా అభ్యర్థుల లిస్టును విడుదల చేసి ప్రచారం ప్రారంభించాలని జాతీయ నేతలు యోచిస్తున్నారు.

Similar News

News July 8, 2024

రేపటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన?

image

తెలంగాణ సీఎం రేవంత్ రేపటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. తొలుత తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో పర్యటించాలని ఆయన నిర్ణయించారట. రేపు ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సీఎం అయ్యాక తొలిసారి జిల్లాల పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.

News July 8, 2024

హిండెన్‌బర్గ్ వివాదం.. దర్యాప్తు చేపట్టిన కోటక్!

image

కింగ్‌డన్ క్యాపిటల్ తమ సంస్థ వేదికగా అదానీ షేర్ల షార్ట్ సెల్లింగ్‌కు పాల్పడటంపై కోటక్ గ్రూప్ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. హిండెన్‌బర్గ్‌తో కింగ్‌డన్‌కు సంబంధాలు ఉన్నాయని ముందే తెలిస్తే అసలు FPI అకౌంట్‌నే ఓపెన్ చేసే వాళ్లము కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. కింగ్‌డన్ ఉద్దేశపూర్వకంగానే ఈ విషయం దాచిందని అనుమానిస్తున్నాయి. ఇందుకు ఆధారాలు లభిస్తే కోటక్ చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

News July 8, 2024

ఉచిత ఇసుకపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

image

AP: ఉచిత ఇసుకపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కలెక్టర్ ఛైర్మన్‌గా జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేసింది. ఇందులో SP, JC, వివిధ శాఖల అధికారులు ఉంటారు. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీల బాధ్యతను జిల్లా కమిటీలే పర్యవేక్షిస్తాయి. ఇసుకను తిరిగి అమ్మినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఉచిత ఇసుకను భవన నిర్మాణాలకు మాత్రమే వాడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.