News November 13, 2024
ప్రభాస్ ‘స్పిరిట్’లోకి పూరీ జగన్నాథ్?
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీ గురించి టాలీవుడ్‌లో ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. ఆ సినిమాకు డైలాగ్స్ రాయాలంటూ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను సందీప్ అడిగారని సమాచారం. అందుకు పూరీ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పూరీ ప్రభాస్‌తో తీసిన బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాల్లో డైలాగ్స్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే.
Similar News
News December 6, 2024
విశాఖ పోర్టులో డ్రగ్స్ కేసుపై వీడిన చిక్కుముడి
AP: ఈ ఏడాది మార్చిలో ఎన్నికల సమయంలో విశాఖ పోర్టుకి బ్రెజిల్ నుంచి 25 వేల టన్నుల డ్రగ్స్ వచ్చిందన్న వార్త సంచలనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రంగంలోకి దిగిన సీబీఐ తాజాగా విచారణను ముగించింది. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్‌లో డ్రగ్స్ లేదని కేవలం డ్రై ఈస్ట్ ఉన్నట్లు కోర్టుకు నివేదిక సమర్పించింది. దీంతో సీజ్ చేసిన షిప్‌ను విడుదల చేసినట్లు కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ తెలిపారు.
News December 6, 2024
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రమాదకరం: కేజ్రీవాల్
బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రమాదకరమని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఢిల్లీ ఓటర్లను హెచ్చరించారు. ఢిల్లీలో బీజేపీ గెలిస్తే ఆప్ పథకాలను నిలిపివేస్తారని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న 20 రాష్ట్రాలో ఉచిత విద్యుత్ ఎక్కడ ఇస్తున్నారని, మంచి స్కూల్స్, ఆస్పత్రులు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. గెలవలేమని తెలిసే ఢిల్లీలో ఆప్ ఓటర్ల తొలగింపునకు బీజేపీ కుట్ర చేస్తోందని విమర్శించారు.
News December 6, 2024
PHOTO: గన్నుతో సీఎం రేవంత్
TG: ప్రజాపాలన-విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ హోంశాఖ విజయాలపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన ఆయుధాల ఎగ్జిబిషన్‌ను ఆయన సందర్శించారు. గన్నులు, రైఫిల్స్ పనితీరును ఆసక్తిగా పరిశీలించారు. ఆ సందర్భంగా తీసిన ఫొటోనే ఇది. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.