News May 20, 2024

BJD పాలనలో పూరీ జగన్నాథ్ ఆలయానికి రక్షణ లేదు: మోదీ

image

ప్రధాని మోదీ ఇవాళ ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథ్ టెంపుల్‌కు BJD పాలనలో రక్షణ లేదని విమర్శించారు. అక్కడి ‘రత్న భండార్’ తాళాలు ఆరేళ్లుగా కనిపించడం లేదన్నారు. ఒడిశా గౌరవం, భాష, కల్చర్ ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నారు.

Similar News

News December 14, 2024

అల్లు అరవింద్‌కు సీఎం చంద్రబాబు ఫోన్

image

అల్లు అర్జున్ తండ్రి అరవింద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు ఘటనపై ఆరా తీసి పరామర్శించారు. ఈ ఘటనపై ఆందోళన చెందవద్దని అరవింద్‌కు సూచించారు. కుటుంబం మొత్తం ధైర్యంగా ఉండాలని భరోసా నింపారు.

News December 14, 2024

ఆధార్ కార్డు ఉన్న వారికి ALERT

image

పదేళ్లుగా ఆధార్ వివరాలు మార్చని వారు ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండా ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం రేపటి(డిసెంబర్ 14)తో ముగియనుంది. ఎల్లుండి నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు UIDAI గడువు పొడిగించగా, మరోసారి పెంచుతుందా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మైఆధార్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, అప్‌డేట్ చేసుకోవచ్చు.

News December 13, 2024

CM చంద్రబాబుకు హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తుంది: పవన్

image

AP: CM చంద్రబాబును Dy.CM పవన్ ప్రశంసించారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ ‘ఆయన 4 దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీని నడిపించాలి. తన కుటుంబంతో పాటు 5 కోట్ల కుటుంబాలను చూసుకోవాలి. వారి అవసరాలను తీర్చాలి. శత్రువుల దాడులనూ తట్టుకోవాలి. అయినా కూడా ఉన్న 24 గంటలను ప్రజల కోసం ఎలా ఉపయోగించాలని ఆలోచిస్తారు. అందుకే ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.