News February 5, 2025
మేడారంలో ఇవాళ్టి నుంచి శుద్ధి కార్యక్రమాలు

TG: ములుగు(D) తాడ్వాయి(మ) మేడారం మినీ జాతరకు సిద్ధమవుతోంది. ఇవాళ్టి నుంచి సమ్మక్క-సారలమ్మకు పూజలు ప్రారంభం కానున్నాయి. కన్నెపల్లిలో సారలమ్మ, మేడారంలోని సమ్మక్క ఆలయాల్లో అర్చకులు శుద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయాల్లోని పూజా సామగ్రిని శుద్ధి చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. దేవతల పీటలను శుభ్రం చేసి, ముగ్గులతో సుందరంగా అలంకరిస్తారు. ఈ నెల 12 నుంచి 15 వరకు మినీ జాతర వేడుకలు నిర్వహిస్తారు.
Similar News
News February 16, 2025
ప్రభాస్ లేటెస్ట్ PHOTO చూశారా?

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ ఫొటో వైరలవుతోంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రభాస్‌ను కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ లాంగ్ హెయిర్‌లో డార్లింగ్ లుక్ అదిరిపోయిందని అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్నారు.
News February 16, 2025
CT-2025.. భారత్ మ్యాచ్‌లకు ఎక్స్‌ట్రా టికెట్లు

భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు ICC గుడ్ న్యూస్ చెప్పింది. CTలో భాగంగా దుబాయ్‌లో IND ఆడే గ్రూప్, తొలి సెమీస్ మ్యాచ్‌లకు అదనపు టికెట్లను ఇవాళ మధ్యాహ్నం నుంచే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. హైబ్రిడ్ విధానంలో CT జరుగుతున్నందున ఫైనల్ మ్యాచ్ టికెట్లు రిలీజ్ చేయలేదు. భారత్ ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ దుబాయ్‌లో, లేకపోతే లాహోర్‌లో జరుగుతుంది. గ్రూప్ స్టేజీలో IND 20న బంగ్లాతో, 23న పాక్‌తో, మార్చి 2న NZతో తలపడనుంది.
News February 16, 2025
ఏపీ ఇష్టారాజ్యం-కాంగ్రెస్ చోద్యం: KTR

TG: కృష్ణా జలాలను ఏపీ ఇష్టారాజ్యంగా తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని KTR విమర్శించారు. నాగార్జునసాగర్ కుడి కాల్వ ద్వారా గత 3 నెలలుగా రోజుకు 10వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ఇప్పటికే 646 టీఎంసీలను వినియోగించుకుందని ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదుల్లో బొట్టు బొట్టును కాపాడి బీడు భూములను KCR సస్యశ్యామలం చేస్తే ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పంటపొలాలను ఎండబెట్టిందని Xలో ఫైరయ్యారు.