News November 28, 2024

ఆస్ట్రేలియాలో పుష్ప-2 ఆల్ టైమ్ రికార్డ్!

image

విడుదలకు ముందే పుష్ప-2 పలు రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. ఆస్ట్రేలియాలో ఆ సినిమా హిందీ వెర్షన్ బాలీవుడ్ సినిమాల్ని కూడా తలదన్నింది. హిందీ సినిమాల ముందస్తు టికెట్ అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిందని ఆస్ట్రేలియన్ తెలుగు ఫిల్మ్స్ ట్వీట్‌ చేయగా, పుష్ప మూవీ టీమ్ దాన్ని రీట్వీట్ చేసింది. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో ‘పుష్ప’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా వచ్చే నెల 5న రిలీజ్ కానుంది.

Similar News

News December 11, 2024

వైద్యులు, ఆర్మీ, టీచర్లపైనే ఎక్కువ నమ్మకం!

image

ప్రపంచంలో ఎన్నో వృత్తులు ఉన్నప్పటికీ ప్రజలు వైద్యులపై ఎక్కువ విశ్వాసం కలిగి ఉన్నట్లు తేలింది. 2024లో IPSOS జరిపిన సర్వేలో ఇండియాలో 57శాతం మంది డాక్టర్ వృత్తిపై ఎక్కువ విశ్వాసంతో ఉన్నారు. దీంతోపాటు ఆర్మీ ఆఫీసర్లను 56%, టీచర్లను 56%, సైంటిస్టులను 54%, జడ్జిలను 52%, బ్యాంకర్స్‌ను 50%, పోలీసులను 47 శాతం మంది నమ్ముతున్నారు. కాగా, రాజకీయ నాయకులు అట్టడుగున ఉన్నట్లు సర్వే రిపోర్ట్ పేర్కొంది.

News December 11, 2024

భారత్ ఓటమి

image

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా జట్టు 83 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 298 పరుగులు చేసింది. ఆ జట్టులో అన్నాబెల్(110) సెంచరీతో చెలరేగారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి 4 వికెట్లు తీశారు. ఛేదనలో స్మృతి మంధాన(105) మినహా మిగతా ప్లేయర్లు విఫలమయ్యారు. AUS బౌలర్ గార్డ్‌నర్ 5 వికెట్లు తీసి పతనాన్ని శాసించారు. దీంతో ఆస్ట్రేలియా 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది.

News December 11, 2024

వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్

image

AP: వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందని మంత్రి లోకేశ్ తెలిపారు. ప్రభుత్వ సమాచారమంతా ఒకే వెబ్‌సైట్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్‌పై కలెక్టర్లతో సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యాశాఖలో అపార్ ఐడీ జారీలో ఇబ్బందులను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం యూఏఈ ప్లాట్‌ఫాం ఒక్కటే పౌరసేవలు అందిస్తోందని పేర్కొన్నారు.