News December 7, 2024
‘RRR’ రికార్డును బద్దలుకొట్టిన ‘పుష్ప-2’
ఓపెనింగ్ డేలో రూ.294 కోట్లు <<14809048>>కొల్లగొట్టిన<<>> పుష్ప-2 భారత సినీ చరిత్రలో తొలిరోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డ్ RRR పేరిట ఉండేది. ఆ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.223 కోట్లు రాబట్టింది. తాజాగా ఆ రికార్డ్‌ను పుష్పరాజ్ బద్దలుకొట్టారు. ఇక నిన్న, ఇవాళ కలిపి ఈ చిత్రం రూ.400 కోట్లపైనే వసూళ్లు చేసే అవకాశం ఉందని సినీవర్గాలు అంటున్నాయి.
Similar News
News January 18, 2025
కొలికపూడిపై అధిష్ఠానం సీరియస్.. చర్యలకు సిద్ధం!
AP: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలకు టీడీపీ అధిష్ఠానం సిద్ధమైంది. ఇటీవల ఓ ఎస్టీ మహిళపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. సీఎం చంద్రబాబు కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం క్రమశిక్షణా కమిటీ ముందు హాజరవ్వాలని కొలికపూడిని ఆదేశించింది. గతంలోనూ ఆయన తీరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
News January 18, 2025
చావు నుంచి తప్పించుకున్నా.. కానీ: షేక్ హసీనా
గత ఏడాది ఆగస్టులో నిరసనకారులు తనను, చెల్లెలిని చంపబోయారని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వెల్లడించారు. ఆ రోజు నుంచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమె తాజాగా ఓ ఆడియో క్లిప్ విడుదల చేశారు. కేవలం 20-25 నిమిషాల వ్యవధిలో చావు నుంచి తప్పించుకున్నామని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే దేవుడు తనను ప్రాణాలతో ఉంచారన్నారు. అయితే తన ఇంట్లో ఉండే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
News January 18, 2025
ఓర్వకల్లులో ఈవీ పార్కు.. 25వేల ఉద్యోగాలు!
AP: రాష్ట్రంలో పీపుల్ టెక్ సంస్థ ఎలక్ట్రిక్ వాహన పార్కు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని మొబిలిటీ వ్యాలీలో రూ.1,800 కోట్ల వ్యయంతో 1200 ఎకరాల్లో ఈ వాహన పార్కును నిర్మించనుంది. ఇది పూర్తయితే దాదాపు 25 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.