News December 7, 2024
‘RRR’ రికార్డును బద్దలుకొట్టిన ‘పుష్ప-2’
ఓపెనింగ్ డేలో రూ.294 కోట్లు <<14809048>>కొల్లగొట్టిన<<>> పుష్ప-2 భారత సినీ చరిత్రలో తొలిరోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డ్ RRR పేరిట ఉండేది. ఆ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.223 కోట్లు రాబట్టింది. తాజాగా ఆ రికార్డ్‌ను పుష్పరాజ్ బద్దలుకొట్టారు. ఇక నిన్న, ఇవాళ కలిపి ఈ చిత్రం రూ.400 కోట్లపైనే వసూళ్లు చేసే అవకాశం ఉందని సినీవర్గాలు అంటున్నాయి.
Similar News
News January 26, 2025
నేటి ముఖ్యాంశాలు
* 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
* డా.నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్, బాలకృష్ణకు పద్మభూషణ్
* హైదరాబాద్ తెలుగు వారందరిది: ఏపీ సీఎం చంద్రబాబు
* జగన్ వద్దన్నా రాజీనామా చేశా: VSR
* రేపు తెలంగాణలో 4 కొత్త పథకాలు ప్రారంభం
* ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వం: బండి
* ఇంగ్లండ్‌పై రెండో టీ20లో భారత్ విజయం
News January 26, 2025
పద్మ పురస్కారాలపై సీఎం రేవంత్ అసంతృప్తి
TG: పద్మ పురస్కారాల్లో రాష్ట్రానికి కేవలం రెండు మాత్రమే రావడంపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం వివక్ష చూపించిందని మండిపడ్డారు. గద్దర్, గోరటి వెంకన్న, అందెశ్రీ, చుక్కా రామయ్యవంటి పలువురు ప్రముఖుల పేర్లను తాము ప్రతిపాదించినా పరిగణించకపోవడం తెలంగాణ ప్రజలందర్నీ అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 139 పద్మ అవార్డుల్లో రాష్ట్రానికి కనీసం 5 కూడా ఇవ్వకపోవడమేంటంటూ సీఎం ప్రశ్నించారు.
News January 26, 2025
‘పద్మ’గ్రహీతలకు అభినందనలు: చిరంజీవి
‘పద్మ’ పురస్కారాలు గెలుచుకున్న తెలుగువారికి మెగాస్టార్ చిరంజీవి ట్విటర్లో అభినందనలు తెలిపారు. ‘పద్మవిభూషణ్ గెలుచుకున్న డాక్టర్ నాగేశ్వరరెడ్డికి, పద్మభూషణ్ పొందిన నా స్నేహితులు నందమూరి బాలకృష్ణ, అజిత్ కుమార్, శ్రీ అనంత నాగ్, శేఖర్ కపూర్, శోభన, పద్మశ్రీ వచ్చిన అర్జిత్ సింగ్, మాడుగుల నాగఫణిశర్మ సహా పద్మ అవార్డీలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.