News July 29, 2024

వచ్చే వారం పుష్ప-2 క్లైమాక్స్ షూటింగ్

image

ఫారిన్ ట్రిప్ ముగించుకుని అల్లు అర్జున్ హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. వచ్చే వారం నుంచి పుష్ప-2 సెట్‌లో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే RFCలో ఇతర నటీనటులపై సన్నివేశాలను తెరకెక్కిస్తుండగా, కొత్త షెడ్యూల్‌లో ఐకాన్ స్టార్‌పై క్లైమాక్స్ సీన్లను డైరెక్టర్ సుకుమార్ చిత్రీకరించనున్నారు. డైరెక్టర్‌తో గొడవపడి అల్లు అర్జున్ ఫారిన్ వెళ్లినట్లు వార్తలు రాగా, చిత్ర యూనిట్ ఖండించిన విషయం తెలిసిందే.

Similar News

News February 15, 2025

ADE అక్రమాస్తులు రూ.100 కోట్లు!

image

TG: గచ్చిబౌలిలో విద్యుత్ శాఖ ఏడీఈ సతీశ్ నివాసంలో ACB అధికారులు సోదాలు నిర్వహించారు. HYD, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 22ఎకరాల భూమి, ప్లాట్లు, విల్లా, భవనాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. అలాగే బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిన్న రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీకి దొరికారు. సోదాల అనంతరం సతీశ్‌ను అరెస్ట్ చేశారు.

News February 15, 2025

బాంబూ సాల్ట్.. కిలో రూ.30,000

image

ఉప్పు బ్రాండ్లను బట్టి KG ₹30-₹200 వరకు ఉంటుంది. అయితే కొరియన్/బాంబూ సాల్ట్ ధర ₹20-30K. దీన్ని తొలుత కొరియాలో తయారుచేసేవారు. వెదురు బొంగులో సముద్రపు ఉప్పును నింపి 400డిగ్రీల వద్ద కాల్చుతారు. ఇలా 9సార్లు చేస్తే స్పటిక రూపంలోకి మారుతుంది. KG తయారీకి 20D పడుతుంది. ఇందులో 73మినరల్స్ ఉంటాయి. దీన్ని వాడితే ఆరోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో ఉత్తరాఖండ్ సర్కార్ దీన్ని తయారుచేస్తోంది.

News February 15, 2025

సిన్నర్‌పై డోపింగ్ ఆరోపణలు.. మూడు నెలలు నిషేధం

image

మెన్స్ టెన్నిస్ నం.1 ప్లేయర్ జన్నిక్ సిన్నర్‌కు భారీ షాక్ తగిలింది. డోపింగ్‌లో పట్టుబడ్డ అతడిపై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 3 నెలల నిషేధం విధించింది. ఫిజియోథెరపీ సమయంలో ఉత్ప్రేరకం తన శరీరంలోకి వెళ్లిందని సిన్నర్ ఆంగీకరించారు. WADA కూడా సిన్నర్ ఉద్దేశపూర్వకంగా ఎలాంటి మోసం చేయలేదని పేర్కొంది. అయినా FEB 9- మే 4 వరకు నిషేధం అమల్లో ఉంటుందంది. కాగా ఇటీవల సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచారు.

error: Content is protected !!