News April 5, 2024
పుష్ప-2 కౌంట్ డౌన్ పోస్టర్

పుష్ప-2 మాస్ జాతర మరో రెండు రోజుల్లో మొదలు కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ కౌంట్ డౌన్ పోస్టర్‌ను విడుదల చేశారు. త్రిశూలంతో ఉన్న ఆ ఫొటో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతోంది. ఇక ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప-2 టీజర్ విడుదల కానుంది. ఈ టీజర్ బన్నీ ఫ్యాన్స్ పూనకాలెత్తేలా ఉండనుందని మేకర్స్ హింట్స్ ఇస్తున్నారు.
Similar News
News October 14, 2025
మోదీ, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పవన్

AP: రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ భాగస్వామ్యంపై Dy.CM పవన్ హర్షం వ్యక్తం చేశారు. ‘$15 బిలియన్ల పెట్టుబడితో విశాఖలో అతిపెద్ద AI డేటా సెంటర్ ఏర్పాటవుతోంది. రాష్ట్రంతో పాటు దేశానికి ఇది ఎంతో ముఖ్యం. చాలామందికి ఉపాధి లభించనుంది. యంగ్ ప్రొఫెషనల్స్‌కు టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. PM మోదీ, CM CBN, కేంద్ర మంత్రులు సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, మంత్రి లోకేశ్, సుందర్ పిచాయ్‌కి నా కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు.
News October 14, 2025
కళ్లు చెదిరిపోయేలా ఉంది వర్మ.. మైండ్ బ్లోయింగ్

‘జైలర్’ మూవీలో కిరీటం చూసి ‘కళ్లు చెదిరిపోయేలా ఉంది వర్మ.. మైండ్ బ్లోయింగ్’ అని డైలాగ్ చెప్పడం గుర్తుందా. ఇప్పుడు నీతా అంబానీ హ్యాండ్‌బ్యాగ్ చూసినా ‘వర్త్ వర్మా.. వేరే లెవల్’ అనాల్సిందే. మనీశ్ మల్హోత్రా దీపావళి వేడుకల్లో నీతూ పాల్గొనగా అందరి దృష్టి ఆమె చేతిలోని బ్యాగ్‌పైనే. ఎందుకంటే దీని ధర ₹17.73కోట్లు. ‘Hermès Sac Bijou Birkin’కి చెందిన అత్యంత ఖరీదైన ఈ బ్యాగ్ తయారీకి 3,025 డైమండ్స్ వాడారట.
News October 14, 2025
డ్రిప్ సిస్టమ్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

సాగులో నీటి వృథా కట్టడికి వాడే డ్రిప్ వినియోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొలంలో ట్రాక్టర్లు, బండ్లు, పశువుల రాకపోకల వలన లేటరల్ పైపులు అణిగిపోకుండా చూడాలి. ఎలుకలు డ్రిప్ సిస్టమ్‌లోని లేటరల్ పైపులను, ఇతర భాగాలను కొరికేయకుండా ఉండాలంటే సిస్టమ్‌ను తరచూ వాడాలి. దీని వల్ల భూమి తేమగా ఉండి ఎలుకలు ఆ పైపుల దగ్గరకురావు. కలుపు తీసేటప్పుడు పదునైన పరికరాలు డ్రిప్ లేటరల్ పైపులను కోసేయకుండా జాగ్రత్తపడాలి.