News April 5, 2024
పుష్ప-2 కౌంట్ డౌన్ పోస్టర్
పుష్ప-2 మాస్ జాతర మరో రెండు రోజుల్లో మొదలు కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ కౌంట్ డౌన్ పోస్టర్‌ను విడుదల చేశారు. త్రిశూలంతో ఉన్న ఆ ఫొటో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతోంది. ఇక ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప-2 టీజర్ విడుదల కానుంది. ఈ టీజర్ బన్నీ ఫ్యాన్స్ పూనకాలెత్తేలా ఉండనుందని మేకర్స్ హింట్స్ ఇస్తున్నారు.
Similar News
News January 26, 2025
ప్రముఖ డైరెక్టర్ గుండెపోటుతో మృతి
మలయాళ డైరెక్టర్ షఫీ(56) కన్నుమూశారు. ఈనెల 16న గుండెపోటుకు గురైన ఆయన కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మరణించారు. కామెడీ చిత్రాలతో పాపులర్ అయిన షఫీ సుమారు 50కి పైగా సినిమాలను డైరెక్ట్ చేశారు. ‘వన్ మ్యాన్ షో’ ఆయన తొలిచిత్రం. కళ్యాణరామన్, పులివల్ కళ్యాణం, తొమ్మనమ్ మక్కలుమ్, టూ కంట్రీస్, చిల్డ్రన్ పార్క్, షెర్‌లాక్ టోమ్స్ తదితర మూవీలు తీశారు. 2022లో వచ్చిన ఆనందం పరమానందం షఫీ చివరి మూవీ.
News January 26, 2025
30 ఏళ్ల పోరాటానికి దక్కిన గుర్తింపు
1965లో ఉమ్మడి వరంగల్(D) న్యూశాయంపేటలో జన్మించిన మందకృష్ణ మాదిగ విద్యార్థి దశలోనే కులవివక్షపై పోరాడారు. కొంతకాలం పీపుల్స్‌వార్‌లో పనిచేశారు. తర్వాత బయటికొచ్చి దళిత ఉద్యమకారుడిగా మారారు. SC వర్గీకరణ కోసం 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా గతేడాది SC వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈక్రమంలోనే నిన్న ఆయనకు కేంద్రం ‘పద్మశ్రీ’ ప్రకటించింది.
News January 26, 2025
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి యూపీఎస్
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(UPS)ను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్‌కు ముందు 12 నెలల్లో పొందిన బేసిక్ పే సగటులో 50 శాతాన్ని పింఛనుగా పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) కింద ఉంటూ, కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని UPSను ఎంచుకున్న ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.