News October 22, 2024
ప్రీరిలీజ్ బిజినెస్‌లో రూ.1000 కోట్లు దాటిన ‘పుష్ప-2’!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్‌లో అప్పుడే రూ.1000 కోట్లు దాటేసిందని సినీవర్గాలు పేర్కొన్నాయి. కేవలం థియేట్రికల్ రైట్స్ ద్వారానే రూ.640 కోట్లు, OTT రైట్స్‌కు రూ.275 కోట్లు, మ్యూజిక్ రైట్స్‌కు రూ.65 కోట్లు, శాటిలైట్ రైట్స్‌కు రూ.85 కోట్లు రావడంతో మొత్తం రూ.1065 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిపాయి.
Similar News
News November 4, 2024
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం ఆపేస్తా: కమలా హారిస్
అమెరికా ఎన్నికల్లో గెలిస్తే గాజాలో యుద్ధం ముగించేందుకు ప్రయత్నిస్తానని కమలా హారిస్ అన్నారు. పాలస్తీనా ప్రజల హక్కుల్ని కాపాడతానని, బందీలను విడిపించి ఇజ్రాయెల్ రక్షణకు కట్టుబడి ఉంటానని హామీలు ఇచ్చారు. ‘ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో ప్రజల రక్షణ కోసం దౌత్యపరంగా పనిచేస్తాను. USలో కొత్త నాయకత్వానికి ఇదే సరైన టైమ్. ప్రెసిడెంట్‌గా దానిని అందిస్తాను. మిడిల్‌క్లాస్ బాధలు తీరుస్తాను’ అని పేర్కొన్నారు.
News November 4, 2024
గంభీర్ ముందు కఠిన పరీక్ష
గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత జట్టు ఆటతీరు ఆశించినంతగా లేదు. శ్రీలంక, న్యూజిలాండ్ చేతిలో సిరీస్‌లను కోల్పోయింది. దీంతో త్వరలో రానున్న టోర్నీలు గౌతీకి అగ్నిపరీక్షలే. జట్టు ఆటను మెరుగుపర్చడంతో పాటు భారత్‌ను విజయతీరాలకు చేర్చాల్సిన బాధ్యత ఆయనపై చాలా ఉంది. ఈ నెల 22 నుంచి పెర్త్ వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుండటంతో ఆయన ఎలాంటి టెక్నిక్స్ అమలు చేస్తారనే ఆసక్తి నెలకొంది
News November 4, 2024
ముచ్చుమర్రి బాలిక కుటుంబానికి వైసీపీ రూ.10 లక్షల సాయం
AP: నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని వైసీపీ ఆదుకుంది. పార్టీ తరఫున రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించింది. ఆ పార్టీ నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చారు. జులై 7న బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి చంపి ఓ కాలువలో పడేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ చిన్నారి మృతదేహం ఆచూకీ దొరకలేదు. నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు.