News December 30, 2024

‘పుష్ప-2’ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

image

మహేశ్ బాబు ‘1-నేనొక్కడినే’ మూవీ ఫలితంతో సినిమాలు ఆపేద్దామనుకున్నానని దర్శకుడు సుకుమార్ అన్నారు. యూఎస్‌లో ఆ సినిమాకు కలెక్షన్లు రాకపోయి ఉంటే సినిమాలు మానేసేవాడినని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గేమ్ ఛేంజర్’ గ్లోబల్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. US ఆడియన్స్ వల్ల ఇలా ఉన్నానంటూ వారికి థాంక్స్ చెప్పారు. ఆ సినిమా తర్వాత లెక్కల మాస్టారు తీసిన రంగస్థలం, పుష్ప, పుష్ప-2 సినిమాలు ఆయనను టాక్ ఆఫ్ ది నేషన్‌గా మార్చాయి.

Similar News

News January 21, 2025

GTA6: ఆడాలంటే రూ.9 వేలు

image

90s కిడ్స్ ఫేవరెట్ కంప్యూటర్ వీడియో గేమ్స్‌లో ఒకటైన GTA 6 వెర్షన్ త్వరలో విడుదల కాబోతోంది. కొత్త ఎడిషన్ గేమ్‌కు రాక్‌స్టార్ $100 (దాదాపు రూ.9000) ఛార్జ్ చేయొచ్చని గేమ్ అనలిస్ట్ మ్యాథ్యూ బాల్ ట్వీట్ చేశారు. ద్రవ్యోల్బణం, పెరిగిన R&D, క్రియేటివ్ కంటెంట్ ఖర్చుల వల్ల ఆ సంస్థ ఈ స్థాయిలో ఛార్జ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంతకీ మీలో ఎంతమంది Grand Theft Auto (GTA) ఫ్యాన్స్ ఉన్నారు? కామెంట్ చేయండి.

News January 21, 2025

HEADLINES

image

*అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం
*కోల్‌కతా హత్యాచార దోషికి జీవిత ఖైదు
*లోకేశ్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్లు.. హైకమాండ్ ఆగ్రహం
*పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు: Dy.CM పవన్
*ఏపీలో 26 మంది IASలు, 27 మంది IPSలు బదిలీ
*స్విట్జర్లాండ్‌లో కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
*తెలంగాణలో మళ్లీ రానున్న కింగ్ ఫిషర్ బీర్లు
*రేవంత్‌కు చుక్కలు చూపెట్టాలి: KTR

News January 21, 2025

ట్రంప్‌నకు ప్రధాని మోదీ అభినందనలు

image

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌నకు శుభాకాంక్షలు. అధ్యక్షుడిగా పదవీకాలం విజయవంతంగా పూర్తి కావాలి. ఇరు దేశాల ప్రయోజనం కోసం కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు.