News December 4, 2024

అక్కడ ‘పుష్ప-2’ మిడ్ నైట్ షోలు రద్దు

image

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమాకు కర్ణాటకలో షాక్ తగిలింది. బెంగళూరులో ‘పుష్ప-2’ మూవీ మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోలు ప్రదర్శించవద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 గంటలకు ముందు షోలు ప్రదర్శించడం చట్టవిరుద్ధమని కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్ల ఫిర్యాదుతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే షోలు వేసేందుకు పలు చోట్ల మూవీ యూనిట్ ఏర్పాటు చేసింది. తాజా ఆదేశాలతో అభిమానులకు నిరాశే ఎదురైంది.

Similar News

News January 15, 2025

కనుమ రోజున రథం ముగ్గు.. ఎందుకంటే?

image

కనుమ రోజున తెలుగు లోగిళ్లలో రథం ముగ్గు వేయడం ఆచారంగా ఉంది. దీని వెనుక పురాణగాథలు ఉన్నాయి. మనిషి శరీరం ఒక రథం అని, ఈ దేహమనే రథాన్ని నడిపేది దైవమని భావిస్తారు. సరైన దారిలో నడిపించమని కోరుతూ ఈ రకంగా ప్రార్థిస్తారు. పాతాళం నుంచి వచ్చిన బలిచక్రవర్తిని సాగనంపేందుకు రథం ముగ్గు వేస్తారని ఓ కథ. అయితే ఈ ముగ్గులు వీధిలోని ఇళ్లను కలుపుతూ వేయడం వల్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలనే సందేశాన్ని ఇస్తోంది.

News January 15, 2025

నేడు సుప్రీంకోర్టులో KTR క్వాష్ పిటిషన్ విచారణ

image

TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు విచారణ జరగనుంది. మరోవైపు రేపు కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ నెల 9న ఆయనను ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం తనపై కక్ష సాధింపుతోనే ఈ కేసు పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు.

News January 15, 2025

వరుసగా 8 హిట్లు ఖాతాలో..

image

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. వరుసగా 8 సినిమాలు సక్సెస్ సాధించిన ఈతరం దర్శకుడు అనిల్ అని సినీ వర్గాలు తెలిపాయి. ఆయన డెబ్యూ మూవీ పటాస్ సూపర్ హిట్‌గా నిలవగా ఆ తర్వాత వచ్చిన సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3, భగవంత్ కేసరి సక్సెస్ అందుకున్నాయి. దీంతో 100% సక్సెస్ రేటును ఆయన కొనసాగిస్తున్నారని పేర్కొన్నాయి.