News November 29, 2024

హైదరాబాద్‌లో ‘పుష్ప-2’ ప్రీరిలీజ్ వేడుక?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరును పెంచారు. ఇప్పటికే చెన్నై, కేరళలో ఈవెంట్స్ నిర్వహించగా ఇప్పుడు హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. మల్లారెడ్డి కాలేజీలో డిసెంబర్ 1న ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. సుకుమార్‌తో సహా చిత్ర బృందం పాల్గొంటుందని వెల్లడించాయి.

Similar News

News January 29, 2026

హార్వర్డ్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌తో సీఎం రేవంత్

image

US పర్యటనలో ఉన్న తెలంగాణ CM రేవంత్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ విద్యార్థులతో భేటీ అయ్యారు. భారతీయ విద్యార్థుల బృందం ఆహ్వానంతో హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌కు వెళ్లారు. కెరీర్ టార్గెట్స్, స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకున్నారు. విద్యార్థుల విజయాలు రాష్ట్రానికి గర్వకారణమని చెప్పారు. రైజింగ్ తెలంగాణ విజన్‌ను వివరించారు. అంతర్జాతీయ పెట్టుబడులకు రాష్ట్రం కేరాఫ్‌గా మారిందని తెలిపారు.

News January 29, 2026

రూపాయి పతనం.. వడివడిగా సెంచరీ వైపు

image

రూపాయి మరింత పతనమైంది. యూఎస్ డాలర్‌తో పోలిస్తే 92 రూపాయలకు చేరింది. దీంతో వారంలోనే మూడోసారి రికార్డులు బ్రేక్ చేసింది. మంగళవారం 91.68గా ఉన్న రూపాయి నిన్న 91.99కి చేరింది. త్వరలోనే ఇది వందకు చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు బంగారం, వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. ఇవాళ రెండు మెటల్స్ 6శాతం వృద్ధి సాధించాయి.

News January 29, 2026

Oh Sh*t.. పైలట్ల ఆఖరి మాటలు ఇవే

image

బారామతి ఫ్లైట్ క్రాష్‌లో మహారాష్ట్ర Dy.CM అజిత్ పవార్ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పైలట్ ఇన్ కమాండ్ సుమిత్ కపూర్, ఫస్ట్ ఆఫీసర్ శాంభవి కూడా ప్రాణాలు కోల్పోయారు. క్రాష్ ల్యాండింగ్‌కి ముందు వాళ్లు మాట్లాడిన ఆఖరి మాటలు కాక్‌పిట్‌‌లో రికార్డ్ అయ్యాయి. వాళ్లు కొన్ని క్షణాల ముందు ‘Oh Sh*t’ అని కేకలు వేసినట్లు DGCA సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాసేపట్లో అజిత్ పవార్ అంత్యక్రియలు జరగనున్నాయి.