News November 29, 2024
హైదరాబాద్‌లో ‘పుష్ప-2’ ప్రీరిలీజ్ వేడుక?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరును పెంచారు. ఇప్పటికే చెన్నై, కేరళలో ఈవెంట్స్ నిర్వహించగా ఇప్పుడు హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. మల్లారెడ్డి కాలేజీలో డిసెంబర్ 1న ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. సుకుమార్‌తో సహా చిత్ర బృందం పాల్గొంటుందని వెల్లడించాయి.
Similar News
News December 9, 2024
ఒక్క రోజు స్కూల్ స్కీమ్ @ Rs.17000
ఫారిన్ టూరిస్టులను ఆకర్షించేందుకు జపాన్ కంపెనీ ఉండోకైయా కొత్తగా ఆలోచించింది. జపనీస్ స్కూల్ లైఫ్‌ను ఆస్వాదించేందుకు ఒక రోజు స్టూడెంట్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. రూ.17వేలు చెల్లిస్తే చాలు. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా చేరొచ్చు. యూనిఫాంతో పాటు కటానా ఫైట్ నేర్చుకొనేందుకు కిమినోస్ డ్రెస్ ఇస్తారు. స్థానిక డాన్స్ నేర్పిస్తారు. యాక్టివిటీస్ చేయిస్తారు. క్లాసుల మధ్యలో భూకంపం వస్తే ఎలా బయటపడాలో బోధిస్తారు.
News December 9, 2024
ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్‌గా IAS సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ రేపు రిటైర్ అవుతున్న విషయం తెలిసిందే. ఎల్లుండి నుంచి మూడేళ్లపాటు మల్హోత్రా గవర్నర్‌గా కొనసాగుతారు.
News December 9, 2024
మేం ఏమన్నా లాలీపాప్‌లు తింటూ కూర్చుంటామా?: మమత
భారత్‌లోని పలు రాష్ట్రాలను ఆక్రమించుకుంటామని కొందరు బంగ్లా రాజకీయ నేతలు, మాజీ సైనికోద్యోగులు చేసిన వ్యాఖ్యలకు సీఎం మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. ‘మీరు బెంగాల్, ఒడిశా, బిహార్‌లను ఆక్రమించుకుంటుంటే మేము మాత్రం లాలీపాప్‌లు తింటూ కూర్చుంటామా?’ అంటూ కౌంటర్ అటాక్ చేశారు. బంగ్లాలో హిందువులు హింసకు గురవుతుండడంపై బెంగాల్ హిందూ, ముస్లింలు ఆందోళనగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.