News January 8, 2025

‘పుష్ప-2’ తొక్కిసలాట.. శ్రీతేజ్ హెల్త్ బులెటిన్

image

పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడుతోందని కిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఆపేశామని, వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగిస్తున్నట్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అటు నిన్న ఉదయం శ్రీతేజ్‌ను హీరో అల్లు అర్జున్ పరామర్శించిన విషయం తెలిసిందే. గత నెల 4న జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ గాయపడగా అతడి తల్లి రేవతి చనిపోయారు.

Similar News

News January 9, 2025

తిరుపతి ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

image

తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులు మృతి చెందడం బాధాకరమని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వానికి అన్నివిధాలా సహాయం చేస్తామని మోదీ స్పష్టం చేశారు. అటు ఘటనపై ఏపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు పురందీశ్వరి విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సూచించారు.

News January 9, 2025

తొక్కిసలాటపై టీటీడీ ఛైర్మన్ ఏమన్నారంటే?

image

తిరుపతి తొక్కిసలాట దురదృష్టకరమని TTD ఛైర్మన్ BR నాయుడు అన్నారు. విషయం తెలిసిన వెంటనే CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినట్లు చెప్పారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని సీఎం సూచించినట్లు పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని వెల్లడించారు. తిరుపతిలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు నాయుడు తెలిపారు.

News January 9, 2025

తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

image

తిరుపతి తొక్కిసలాట ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన అస్వస్థతకు గురైనవారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుపతి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సీఎం, టీటీడీ ఛైర్మన్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైనవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.