News January 8, 2025
‘పుష్ప-2’ తొక్కిసలాట.. శ్రీతేజ్ హెల్త్ బులెటిన్
పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడుతోందని కిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఆపేశామని, వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగిస్తున్నట్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అటు నిన్న ఉదయం శ్రీతేజ్‌ను హీరో అల్లు అర్జున్ పరామర్శించిన విషయం తెలిసిందే. గత నెల 4న జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ గాయపడగా అతడి తల్లి రేవతి చనిపోయారు.
Similar News
News January 17, 2025
ఆడలేక మద్దెల దరువన్నట్లుగా చంద్రబాబు తీరు: షర్మిల
AP: ‘ఏరుదాటేదాక ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న’ తీరుగా CBN వ్యవహారం ఉందని APCC చీఫ్ షర్మిల మండిపడ్డారు. సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసి ఇప్పుడు ఆదాయం పెరగాలంటున్నారని దుయ్యబట్టారు. హామీలు ఇచ్చే ముందు రాష్ట్రానికి రూ.10లక్షల కోట్ల అప్పులున్నాయని తెలియదా? అని ప్రశ్నించారు. ఆడలేక మద్దెల దరువన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందన్నారు. ఏపీకి ఏమాత్రం సహకరించని మోదీతో పొత్తు ఎందుకని Xలో నిలదీశారు.
News January 17, 2025
రక్తం కారుతున్నా సైఫ్ సింహంలా వచ్చారు: వైద్యులు
దుండగుడి దాడిలో సైఫ్ అలీఖాన్‌కు తీవ్ర రక్తస్రావమైనా స్ట్రెచర్ ఉపయోగించలేదని ముంబైలోని లీలావతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కుమారుడితో కలిసి ఆస్పత్రికి వచ్చే సమయంలో రక్తం వస్తున్నా ‘ఒక సింహంలా, రియల్ హీరోలా’ నడుచుకుంటూ వచ్చారని చెప్పారు. వెన్నెముకలో కత్తి మరో 2 MM లోపలికి దిగి ఉంటే సీరియస్ ఇంజురీ అయి ఉండేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడికి పక్షవాతం వచ్చే అవకాశం లేదని, క్షేమంగా ఉన్నారని వివరించారు.
News January 17, 2025
సైఫ్ ఇంట్లో సెక్యూరిటీ, సీసీ కెమెరాలు లేవు: పోలీసులు
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఇంట్లో CCTV కెమెరాలు లేకపోవడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని ముంబై పోలీసులు వెల్లడించారు. విజిటర్స్‌ను చెక్ చేసేందుకు, ఎమర్జెన్సీ సమయంలో వెంటనే స్పందించేందుకు వారి ఫ్లాట్ ముందు పర్సనల్ గార్డ్స్ కూడా లేరని తెలిపారు. ఆ బిల్డింగ్‌కు వచ్చే వారి వివరాలు నమోదు చేసేందుకు లాగ్ బుక్ కూడా లేదని చెప్పారు. సెలబ్రిటీలు సెక్యూరిటీ పెట్టుకోకపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.