News December 1, 2024
‘పుష్ప-2’ టికెట్ ధర రూ.3000.. ఎక్కడంటే?

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ మూవీ టికెట్స్ ఆన్‌లైన్ బుకింగ్స్ మొదలవగా వేగంగా అమ్ముడవుతున్నాయి. తెలంగాణలో ఒక్కో టికెట్ ధర రూ.350- రూ.500+గా ఉంది. అయితే, ముంబై జియో వరల్డ్ డ్రైవ్‌లోని PVRలో ఒక్క టికెట్‌కు అత్యధికంగా రూ.3000గా ఉండటంతో అంతా షాక్ అవుతున్నారు. అయినప్పటికీ బుక్ చేసుకుంటున్నారు. దీంతో ‘పుష్ప-2’ క్రేజ్ మామూలుగా లేదంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
Similar News
News February 14, 2025
స్కూలు విద్యార్థులకు శుభవార్త

AP: BC విద్యార్థుల ₹110.52 కోట్ల డైట్ బకాయిలు, ₹29 కోట్ల కాస్మోటిక్ బిల్లులు చెల్లించాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ₹13.10 కోట్లతో 660 హాస్టళ్లలో చేపట్టిన మరమ్మతులు 6 వారాల్లో పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, కిచెన్ ఐటెమ్స్ అందించాలని సూచించారు. నసనకోట, ఆత్మకూరు BC సంక్షేమ బాలికల పాఠశాలలను రెసిడెన్షియల్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని చెప్పారు.
News February 14, 2025
ఆటవిక పాలనలోనే దాడులు, హత్యలు: సీఎం

AP: నేరస్థులు రాజకీయాల్లో ఉంటే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అని CM చంద్రబాబు చెప్పారు. ఐదేళ్లు ప్రజాస్వామ్యాన్ని చంపి ఇప్పుడు కొత్తదారులు వెతుకుతున్నారని వైసీపీ నేతలను విమర్శించారు. అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మించాలనేది వారి తాపత్రయమన్నారు. ఆటవిక పాలనలోనే దాడులు, విధ్వంసాలు, హత్యలు జరుగుతాయని తెలిపారు. తాము ప్రజాస్వామ్యవాదులమని, చట్టబద్ధంగా పాలన చేస్తున్నామని పేర్కొన్నారు.
News February 14, 2025
నీ సంకల్పం గొప్పది బ్రో..!

సివిల్ సర్వెంట్ కావాలనేది ఎంతో మంది కల. దీనికి ఎంతో కష్టమైన UPSC పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వాల్సిందే. కొందరు నాలుగైదు అటెంప్ట్స్‌లో, మరికొందరు ఒక్కసారికే సివిల్ సర్వెంట్ అయిపోతుంటారు. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన శ్రీవాస్తవ(48) ఇప్పటివరకు UPSC, MPPSC కలిపి 73 సార్లు ప్రిలిమ్స్, 43సార్లు మెయిన్స్, 8 సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లినా ఉద్యోగం పొందలేకపోయారు. ప్రతిసారి నిరాశే ఎదురైనా ప్రిపరేషన్ కొనసాగించారు.