News December 2, 2024
ఏపీలో పుష్ప-2 టికెట్ ధరలు భారీగా పెంపు

పుష్ప-2 సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 4న ప్రీమియర్ షో రా.9.30 గంటలకు ఒక టికెట్ రూ.800గా నిర్ణయించింది. డిసెంబర్ 5 నుంచి 17 వరకు గరిష్ఠంగా రూ.200 వరకు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీప్లెక్సుల్లో రూ.200, సింగిల్ స్క్రీన్లలో లోయర్ క్లాసుకు రూ.100, అప్పర్ క్లాసుకు రూ.150 వరకు పెంచుకోవచ్చంది.
Similar News
News March 13, 2026
ఫ్లాష్ ఫ్లడ్స్‌ను 24hrs ముందే అంచనా వేయొచ్చు: పిచాయ్

పట్టణాల్లో ఆకస్మిక వరదలను 24hrs ముందే అంచనా వేసే ‘గ్రౌండ్ సోర్స్’ అనే కొత్త AI మోడల్‌ను రూపొందించినట్లు గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటించారు. ‘జెమినీ’ సాయంతో ఇది 150+ దేశాల్లో 26లక్షల వరద సంఘటనలను విశ్లేషించిందని తెలిపారు. శాస్త్రవేత్తల పరిశోధనలు, ప్రజల సేఫ్టీ కోసం ఈ డేటాను గూగుల్ <
News March 13, 2026
సీక్వెల్ సినిమాకి డైరెక్టర్‌గా బోయపాటి?

‘అఖండ-2’ తర్వాత బోయపాటి శ్రీను చేసే తర్వాత సినిమా ఏంటనే దానిపై సస్పెన్స్ నెలకొంది. సన్నీ డియోల్‌తో ‘జాట్-2’ డైరెక్ట్ చేయమని ఆయన్ను మైత్రీ సంస్థ సంప్రదించినట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. ఇందుకోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘జాట్’కు ఇది సీక్వెల్‌గా రానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఆఫర్‌ను తీసుకుంటారా? వదులుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.
News March 13, 2026
చరిత్రలో ఈ రోజు (మార్చి 13)

1899: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం (ఫొటోలో)
1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్ మరణం
1926: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత వి.రామచంద్రరావు జననం
1940: జలియన్ వాలాబాగ్ కారకుడు మైఖేల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో హతమార్చాడు


