News April 2, 2024

పుష్ప-2 అప్డేట్ ఇదేనా..?

image

పుష్ప-2 నుంచి ఇవాళ క్రేజీ అప్డేట్ రానున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్స్‌ ట్విటర్‌లో ‘పుష్ప-2’‌ను ట్రెండ్ చేస్తున్నారు. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్‌ను బీట్ చేసే మరో అప్డేట్ రానుందని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. మరికొందరేమో సాంగ్ లేదా టీజర్ వదిలితే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. మరి మీరేం కోరుకుంటున్నారు?

Similar News

News January 7, 2026

నెల్లూరు: 15 మండలాలకు స్వచ్ఛ రథాలు.!

image

ప్రభుత్వం స్వచ్ఛ గ్రామాల సంకల్పంతో స్వచ్ఛ రథాలను అందుబాటులోకి తేనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలోని 15 మండలాల్లో గతంలో ఇంటింటికీ వచ్చి బియ్యం ఇచ్చే వాహనాల మాదిరిగా రథాలను సిద్ధం చేస్తున్నారు. ఈ రథాల్లో చెత్త సేకరణ గది, సరుకులతో కూడిన ప్రత్యేక ర్యాక్ ఉంటుంది. పొడి వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు, ఇనుప వస్తువులు అందిస్తే సరుకులు పొందవచ్చు. సరుకులు వద్దనుకుంటే నగదు చెల్లిస్తారు.

News January 7, 2026

ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేత

image

TG: నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవికి బిగ్ షాక్ తగిలింది. 5 కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశం ఉందని పోలీసులు వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.

News January 7, 2026

RARE: పర్ఫెక్ట్ ఫిబ్రవరి.. గమనించారా?

image

వచ్చే ఫిబ్రవరి నెలను ‘పర్ఫెక్ట్ ఫిబ్రవరి’గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. ఆ నెల ఆదివారంతో మొదలై సరిగ్గా 28 రోజులు పూర్తి చేసుకుని శనివారంతో ముగియనుంది. అంటే ఎక్కడా మిగిలిపోకుండా కచ్చితంగా 4 వారాల కాలచక్రాన్ని కలిగి ఉండటం విశేషం. చివరిసారిగా 2015లో ఇలానే జరిగింది. క్యాలెండర్‌లో నెలంతా ఒక క్రమ పద్ధతిలో సెట్ అవ్వడంతో దీనిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మీరూ ఇది గమనించారా? COMMENT