News May 4, 2024

ట్రక్కు వెనుక ట్రక్కు పెట్టి.. రైళ్లు పరిగెత్తి! -2/2

image

ట్రక్కుల డీజిల్-టోల్ ఖర్చులు, సమయాన్ని తగ్గించేందుకే ఈ RORO సేవలు తీసుకొచ్చారట. రైలు గమ్యాన్ని సమీపించాక అక్కడి నుంచి ట్రక్కులు రోడ్డు మార్గంలో నిర్ణీత ప్రాంతానికి సరకు తీసుకెళ్తాయి. DFCCILలో ఈస్టర్న్ DFC, వెస్ట్రన్ DFC అనే విభాగాలు ఉన్నాయి. UPలోని దాద్రి నుంచి బిహార్‌లోని సోన్ నగర్‌ మధ్య EDFC (రోజుకు 70-75రైళ్లు), దాద్రి టు సనంద్ (గుజరాత్) మధ్య WDFC (రోజుకు 40-45 రైళ్లు) సేవలు కొనసాగుతున్నాయి.

Similar News

News December 6, 2025

జగిత్యాల: పంచాయతీ ఎన్నికల బరిలో ట్రాన్స్‌జెండర్

image

JGTL(D) ఎండపల్లి మండలం చర్లపల్లికి చెందిన ట్రాన్స్‌జెండర్ శ్రీప్రేమ గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామంలోని 9వ వార్డు స్థనానికి నామినేషన్ దాఖలు చేశారు. గ్రామాభివృద్ధి, పేదల సంక్షేమం, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులైన ప్రతి వ్యక్తికి చేరవేయడమే తన లక్ష్యమని శ్రీప్రేమ అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఓ ట్రాన్స్‌జెండర్ స్థానిక సమరంలోకి దిగడం చర్చనీయాంశమైంది.

News December 6, 2025

పుతిన్ భారత పర్యటనపై చైనా మీడియా ఏమందంటే..?

image

భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనపై చైనా మీడియా స్పందించింది. 2 దేశాలు ఒంటరిగా లేవని ప్రపంచానికి పంపిన సందేశమని ‘గ్లోబల్ టైమ్స్’ చెప్పింది. ‘భారత్, రష్యా తమ సామర్థ్యాలను సొంతంగా, మరింతగా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. 2 దేశాల మధ్య సమన్వయం, సహకారమే ఇందుకు నిదర్శనం. US, వెస్ట్ ఆంక్షలు ఫలించవు’ అని ఫారిన్ అఫైర్స్ వర్సిటీ ప్రొఫెసర్ లీ హైడాంగ్ చెప్పారని తెలిపింది.

News December 6, 2025

30ల్లోకి వచ్చారా..?

image

30ల్లోకి అడుగుపెట్టాక చర్మం నెమ్మదిగా సాగే గుణాన్ని కోల్పోతుంది. కేవలం మాయిశ్చరైజర్ ఈ వయసులో సరిపోదు. యాంటీఆక్సిడెంట్లు ఉన్న ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలి. పగలు ఇ, సి విటమిన్లు, గ్రీన్ టీ ఉన్న ఉత్పత్తులు, రాత్రి రెటినాయిడ్ క్రీములు వాడాలి. ఇవి కొలాజన్ ఉత్పత్తిని పెంచడంతోపాటు చర్మంపై ఏర్పడిన ముడతలు, గీతలను తగ్గిస్తాయి. వీటితో పాటు సన్ స్క్రీన్‌ తప్పనిసరి. ఫేషియల్ ఎక్సర్‌సైజ్‌‌లు చేయడం కూడా మంచిది.