News November 19, 2024
అణ్వాయుధాల వాడకానికి పుతిన్ గ్రీన్ సిగ్నల్

తమపై ఎవరైనా దాడికి దిగినట్లైతే అణ్వాయుధాలను విస్తృతంగా వాడేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యుద్ధం మొదలై 1000 రోజులు పూర్తైన సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్కు లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇచ్చేందుకు US తాజాగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయాన్ని పుతిన్ వ్యతిరేకిస్తున్నారు. అందుకు తగిన బదులిచ్చేందుకే ఆయన అణ్వాయుధాల వాడకానికి పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Similar News
News January 9, 2026
తీవ్ర వాయుగుండం.. రేపు వర్షాలు: APSDMA

AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమై ఉందని APSDMA తెలిపింది. దీంతో శని, ఆదివారాల్లో నెల్లూరు, చిత్తూరు, TPT జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. తీవ్ర వాయుగుండం రేపు మధ్యాహ్నం ఉత్తర శ్రీలంకలోని ట్రింకోమలీ-జాఫ్నా మధ్య తీరాన్ని దాటవచ్చంది.
News January 9, 2026
సౌతాఫ్రికాలో చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు!

సౌతాఫ్రికాలో రేపటి నుంచి బ్రిక్స్ దేశాల నేవల్ డ్రిల్స్ జరగనున్నాయి. ఇందుకోసం చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. బ్రిక్స్ మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవడానికి కూటమి సభ్యులను ఒకచోటుకు చేర్చుతామని సౌతాఫ్రికా చెప్పింది. UAE తమ నౌకలను, ఇండోనేషియా, ఇథియోపియా, బ్రెజిల్ అబ్జర్వర్లను పంపుతున్నట్లు తెలిపింది. ఇండియా, ఈజిప్ట్, సౌదీ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
News January 9, 2026
చిరంజీవి సినిమా.. టికెట్ రేట్ల పెంపు

AP: చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న ప్రీమియర్ షో (8PM-10PM)కు టికెట్ ధర రూ.500 (జీఎస్టీ కలిపి)గా నిర్ణయించింది. జనవరి 12 నుంచి 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.120 పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది.


