News November 19, 2024

అణ్వాయుధాల వాడకానికి పుతిన్ గ్రీన్ సిగ్నల్

image

తమపై ఎవరైనా దాడికి దిగినట్లైతే అణ్వాయుధాలను విస్తృతంగా వాడేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యుద్ధం మొదలై 1000 రోజులు పూర్తైన సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇచ్చేందుకు US తాజాగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయాన్ని పుతిన్ వ్యతిరేకిస్తున్నారు. అందుకు తగిన బదులిచ్చేందుకే ఆయన అణ్వాయుధాల వాడకానికి పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Similar News

News March 15, 2026

ANU: సజావుగా దూరవిద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో MBA, MCA ప్రవేశ పరీక్ష ఆదివారం సజావుగా జరిగినట్లు CDE వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ANUలోని పరీక్ష కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 కేంద్రాలలో 736 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని 670 మంది పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. ఈ నెల 17న సాయంత్రం ఫలితాలను విడుదల చేస్తామన్నారు.

News March 15, 2026

పెన్షన్ పెంపు, మహిళలకు రూ.2,500.. త్వరలో కీలక ప్రకటన!

image

TG: ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో పెండింగ్‌లో ఉన్నవాటి అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2,500, పెన్షన్ రూ.4,000కు పెంపు హామీలపై రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రకటన చేస్తారని విశ్వసనీయ సమాచారం. ఇక కొత్త సంక్షేమ పథకాలు, నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి అంశాలపైనా కీలక నిర్ణయాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

News March 15, 2026

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న RCB క్రికెటర్!

image

RCB కీలక బౌలర్ యశ్ దయాల్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 4న కంటెంట్ క్రియేటర్ శ్వేతా పుండీర్‌తో వివాహం జరిగినట్లు తాజాగా క్రీడా వర్గాలు తెలిపాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే అతడికి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు అతడిపై కేసు ఉన్న విషయం తెలిసిందే. రాజస్థాన్ హైకోర్టు యశ్‌కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది.