News September 12, 2024
చర్చలకు ప్రధాని మోదీకి పుతిన్ ఆహ్వానం
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సమయంలో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు రావాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ PM మోదీని ఆహ్వానించారు. వచ్చే నెల 22-24 తేదీల మధ్య రష్యాలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఇటు.. భారత NSA అజిత్ దోవల్ పుతిన్‌తో ఈరోజు భేటీ అయ్యారు. భారత్‌లోని రష్యా ఎంబసీ ఆ ఫొటోలను షేర్ చేసింది. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మోదీ రూపొందించిన శాంతి ప్రణాళికల్ని దోవల్ పుతిన్ వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం.
Similar News
News October 16, 2024
ఇళ్లలోనే కూర్చొని సేవ చేస్తామంటే కుదరదు.. IASలపై ‘క్యాట్’ ఆగ్రహం
తాము ఏపీకి వెళ్లబోమని IASలు వాణీప్రసాద్, ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ వేసిన పిటిషన్‌లపై <<14364444>>CAT<<>> తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘IASలు ఇళ్లలోనే కూర్చొని సేవ చేస్తామంటే కుదరదు. సరిహద్దుల్లో సమస్యలు వస్తే వెళ్లరా? విజయవాడలో భారీ వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి చోటుకు వెళ్లి సేవ చేయాలని లేదా?’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. CAT తీర్పుపై IASలు HCలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
News October 16, 2024
త్వరలో వైన్ షాపుల్లో పర్మిట్ రూమ్‌లు?
AP: మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు రూ.5 లక్షలు ఫీజుగా వసూలు చేస్తుందని సమాచారం. త్వరలోనే దీనిపై సర్కార్ ఓ నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. కాగా నేటి నుంచి రాష్ట్రంలోని 3,396 ప్రైవేట్ మద్యం దుకాణాలు తెరుచుకుంటాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయిస్తారు. అన్ని ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి.
News October 16, 2024
నేడు భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు
మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా 36 ఏళ్లుగా న్యూజిలాండ్ మన గడ్డపై సిరీస్ గెలవలేదు. ఇప్పుడైనా గెలిచి ఆ రికార్డును తుడిచేయాలని కివీస్ భావిస్తోంది. మరోవైపు టీమ్ ఇండియాకు సొంత గడ్డపై ఎదురేలేకుండా పోతోంది. 2013 నుంచి ఇక్కడ ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు.