News September 24, 2024
పీవీ సింధుకు కొత్త కోచ్: ఎవరంటే?
పారిస్ ఒలింపిక్స్‌లో తీవ్రంగా నిరాశపరిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కొత్త కోచ్‌ను నియమించుకున్నారు. భారత మాజీ షట్లర్ అనూప్ శ్రీధర్ ఆమెకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుత కోచ్ అగస్ ద్వి శాంటోసో పదవీకాలం ఒలింపిక్స్‌తోనే ముగిసింది. కాగా శ్రీధర్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. లక్ష్యసేన్‌కు ఈ ఏడాది జనవరి వరకు కోచ్‌గా ఉన్నారు
Similar News
News October 7, 2024
పాజిటివ్ సిగ్నల్స్ పంపిన ఆసియా స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడయ్యే అవకాశం ఉంది. ఆసియా మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ అందాయి. జపాన్ నిక్కీ, తైవాన్ సూచీలు 2% మేర పెరిగాయి. హాంగ్‌సెంగ్, స్ట్రెయిట్ టైమ్స్, గిఫ్ట్ నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా ఎకానమీ, జాబ్ డేటా మెరుగ్గా ఉండటం, క్రూడాయిల్ ధరలు తగ్గడమే ఇందుకు కారణాలు. పైగా డాలర్ ఇండెక్స్, బాండ్ యీల్డులు పెరిగాయి. RBI MPC ప్రభావం మన మార్కెట్లపై ఉండొచ్చు.
News October 7, 2024
టమాటా కిలో రూ.100
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా రేటు అమాంతం పెరిగింది. హోల్‌సేల్ మార్కెట్లు, మండీలలోనే ధర రూ.80-90 ఉండగా, రిటైల్ మార్కెట్‌లో రూ.100 దాటేసింది. భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతోనే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి ధర కూడా రూ.70-80కి చేరింది. కిలో బెండకాయలు రూ.70, బీన్స్ రూ.100, దొండ రూ.60, క్యాప్సికం రూ.80, బీరకాయ రూ.70 చొప్పున విక్రయిస్తున్నారు.
News October 7, 2024
అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు ₹23 కోట్లు అంటూ ప్రచారం.. ప్రభుత్వం ఏమందంటే?
AP: ఇటీవల వరద సహాయక చర్యల్లో భాగంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకే రూ.23 కోట్లు ఖర్చు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. బాధితులకు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు అందించడంతోపాటు మొబైల్ జనరేటర్ల ద్వారా విద్యుత్ సమస్యలు తీర్చామని తెలిపింది. వాటన్నిటికీ కలిపి రూ.23 కోట్ల ఖర్చయిందని, అందులోనూ మొబైల్ జనరేటర్లకు ఎక్కువ మొత్తం వెచ్చించామని పేర్కొంది. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కోరింది.