News March 5, 2025

రచిన్ రవీంద్ర సెంచరీ.. భారీ స్కోర్ దిశగా కివీస్

image

CT సెమీ ఫైనల్-2లో సౌతాఫ్రికాపై కివీస్ ఓపెనర్ రచిన్ రవీంద్ర శతకం బాదారు. 93 బంతుల్లోనే 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో అద్భుత సెంచరీ సాధించారు. CTలో రచిన్‌కు ఇది రెండో సెంచరీ(తొలి శతకం బంగ్లాపై) కావడం విశేషం. మరోవైపు, విలియమ్‌సన్(62*) అర్ధశతకంతో మెరవడంతో కివీస్ జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. వీరిద్దరి మధ్య 138 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోర్ 186/1గా ఉంది.

Similar News

News March 24, 2025

వైజాగ్-సికింద్రాబాద్ ట్రైన్ అలర్ట్

image

TG: వైజాగ్ నుంచి సికింద్రాబాద్ మీదుగా వెళ్లే నాలుగు రైళ్లను చర్లపల్లి టెర్మినల్ మీదుగా మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. లోక్‌‌మాన్య తిలక్ , సంబల్ పూర్ సూపర్ ఫాస్ట్, విశాఖ-నాందేడ్, విశాఖ-సాయినగర్ వీక్లీ ఎక్స్‌ప్రైస్‌ల రూటు మార్చనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 22నుంచి ఈ మార్పులు చేపట్టనున్నారు. దారి మళ్లించడంతో అదనపు ప్రయాణం తమకు భారమవుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News March 24, 2025

అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం

image

TG: అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులైన ఎమ్మెల్యే వివేక్, బాల్క సుమన్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వీరిద్దరూ దాదాపు 10 నిమిషాల పాటు సమావేశమయ్యారు. కాసేపటికి వీరి వద్దకు కేటీఆర్ వచ్చి వివేక్‌తో కాసేపు మాట్లాడారు. వీరిని ఓ ఎమ్మెల్యే ఫొటో తీస్తుండగా కేటీఆర్ వారించినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ నియోజకవర్గాలతో పాటు ఢిల్లీ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.

News March 24, 2025

ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్ఠానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పిలుపు వచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహేశ్ గౌడ్, తదితరులు హస్తినకు బయల్దేరనున్నారు. ఈ సాయంత్రం కేసీ వేణుగోపాల్‌తో వీరందరూ భేటీ కానున్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!