News November 15, 2024

శాసనమండలిలో రగడ.. మంత్రి ఆగ్రహం

image

AP: మెడికల్ కాలేజీలపై చర్చ సందర్భంగా శాసనమండలిలో రగడ జరిగింది. కాలేజీల నిర్మాణం, సీట్ల కేటాయింపుపై ప్రభుత్వ విధానం చెప్పాలని YCP ఎమ్మెల్సీలు నినదించారు. దీనిపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. YCP ప్రభుత్వ హయాంలో ప్రచారం చేశారే తప్ప కాలేజీలు కట్టలేదని మండిపడ్డారు. 26జిల్లాల్లో కాలేజీల పేరుతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పార్టీ ఆఫీసులు కట్టారని ఆరోపించారు. అనంతరం YCP సభ్యులు వాకౌట్ చేశారు.

Similar News

News November 28, 2025

కరీంనగర్: 2019 సం.లో 108.. మరి ఇప్పుడు..?

image

2019 స్థానిక ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1210 గ్రామ పంచాయతీలు ఉండగా, మొత్తం 108 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో KNRలో 15, PDPలో 13, JGTLలో 37, SRSLలో 43 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అయితే, ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షల నిధులు కేటాయిస్తామనటంతో, ఈ నిధులతో తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని అనుకున్న నాయకుల ఆశలపై అప్పటి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నీళ్లు చల్లింది.

News November 28, 2025

కామారెడ్డి: జాగృతి చీఫ్ కవిత నేటి షెడ్యూల్

image

KMR జిల్లాలో శుక్రవారం తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. హోటల్ అమృత గ్రాండ్‌లో ఉదయం 10 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడే 11 గంటలకు విద్యావంతులు, మేధావులతో సమావేశం నిర్వహిస్తారు. 12 గంటలకు కామారెడ్డి పట్టణ వరద భాదిత కాలనీ సందర్శిస్తారు. 2:30 గంటలకు జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శిస్తారు. 4:30 గంటలకు భిక్కనూర్ సిద్ధి రామేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు.

News November 28, 2025

నేడు కామారెడ్డికి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్న PDSU 23వ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య హాజరుకానున్నారు. PDSU జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు. జిల్లాలోని పీడీఎస్‌యూ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై, మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.