News November 15, 2024

శాసనమండలిలో రగడ.. మంత్రి ఆగ్రహం

image

AP: మెడికల్ కాలేజీలపై చర్చ సందర్భంగా శాసనమండలిలో రగడ జరిగింది. కాలేజీల నిర్మాణం, సీట్ల కేటాయింపుపై ప్రభుత్వ విధానం చెప్పాలని YCP ఎమ్మెల్సీలు నినదించారు. దీనిపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. YCP ప్రభుత్వ హయాంలో ప్రచారం చేశారే తప్ప కాలేజీలు కట్టలేదని మండిపడ్డారు. 26జిల్లాల్లో కాలేజీల పేరుతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పార్టీ ఆఫీసులు కట్టారని ఆరోపించారు. అనంతరం YCP సభ్యులు వాకౌట్ చేశారు.

Similar News

News March 6, 2026

ఎస్సీ వర్గీకరణలో మాదిగల వైపు న్యాయం ఉంది: సీఎం రేవంత్

image

TG: సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత SC వర్గీకరణపై ప్రకటన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని CM రేవంత్ చెప్పారు. HYDలో మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘వర్గీకరణలో మాదిగల వైపు న్యాయం ఉంది. అందుకే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మీవైపే నిలబడ్డాను. భారతంలో నా ఫేవరెట్ క్యారెక్టర్స్ కర్ణుడు, బర్బరీకుడు. కర్ణుడి మాదిరిగా మాదిగల విషయంలో మిత్ర ధర్మం పాటిస్తూ బర్బరీకుడిలా పనిచేశా’ అని తెలిపారు.

News March 6, 2026

RECORD: దేశంలోనే పిన్నవయసు CA

image

రాజస్థాన్‌కు చెందిన రాజ్‌కుమారి పరేఖ్ చరిత్ర సృష్టించారు. దేశంలోనే అత్యంత పిన్నవయసు ఛార్టెర్డ్ అకౌంటెంట్ (CA)గా నిలిచారు. ఇటీవల సీఏ ఫైనల్ ఫలితాల్లో ఆమె ఉత్తీర్ణత సాధించారు. 19 ఏళ్ల 126 రోజుల్లోనే ఈ ఘనత సాధించారు. అంతకుముందు ఈ రికార్డు మధ్యప్రదేశ్‌కు చెందిన నందినీ అగర్వాల్ (19 ఏళ్ల 330 రోజులు) పేరిట ఉండేది. కాగా దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో సీఏ ఒకటి.

News March 6, 2026

ఎప్‌స్టీన్ ఫైల్స్.. ట్రంప్‌పై షాకింగ్ ఆరోపణలు

image

ఎప్‌స్టీన్ కేసులో అదృశ్యమైన 16 పేజీల డాక్యుమెంట్లను US DOJ తాజాగా బయటపెట్టింది. ఇందులో 1983లో ఒక మైనర్ బాలికపై ట్రంప్ లైంగిక దాడికి పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో తాను అడ్డుచెప్పగా ట్రంప్ తనను కొట్టి అక్కడి నుంచి పంపేశారని ఆ మహిళ FBI విచారణలో పేర్కొంది. ఈ రికార్డులను ఇన్నాళ్లూ ఎందుకు దాచారనే అంశం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. కాగా ట్రంప్ ఈ ఆరోపణలను ఖండించారు.