News February 17, 2025
మోదీ నివాసంలో సమావేశానికి హాజరైన రాహుల్

ప్రధాని మోదీ తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. దీనికి కేంద్రమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు హాజరయ్యారు. ఈ భేటీలో కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్(CEC) నియామకంపై నిర్ణయం తీసుకోనున్నారు. రేపటితో CEC రాజీవ్ కుమార్ పదవీకాలం ముగియనుంది.
Similar News
News March 25, 2025
ఉద్యోగులు, పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్!

ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైనట్టు తెలిసింది. ఏప్రిల్ ఆరంభంలో షరతులు, నిబంధనలను క్యాబినెట్ ఆమోదం కోసం పంపనుందని సమాచారం. ఆ తర్వాత అధికారిక నోటిఫికేషన్‌తో కమిషన్ పని ఆరంభిస్తుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖలు, DoPT నుంచి సూచనలు వచ్చాయి. కమిషన్ ఏర్పాటయ్యాక వీటిని సమీక్షిస్తుంది. దీంతో 50లక్షలకు పైగా ఉద్యోగులు, పింఛన్‌దారులకు ప్రయోజనం దక్కుతుంది.
News March 25, 2025
టికెట్ ధరల పెంపుపై ‘రాబిన్ హుడ్’ టీమ్ ప్రకటన

కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో మినహా ఏపీ, తెలంగాణలో టికెట్ ధరల పెంపు లేదని రాబిన్ హుడ్ మూవీ యూనిట్ తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. టికెట్ ధరల పెంపుపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. అభిమానులకు సరసమైన ధరలకే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. సమీప థియేటర్లలో ఈ నెల 28న రాబిన్ హుడ్ సినిమా చూసి ఆనందించాలని కోరింది.
News March 25, 2025
BIG BREAKING: ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రోల్ నంబర్, బర్త్ డే వివరాలను ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: <