News August 31, 2024
సెప్టెంబర్ 4 నుంచి JKలో రాహుల్ ప్రచారం!
రాహుల్ గాంధీ సెప్టెంబర్ 4 నుంచి జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారం మొదలు పెడతారని సమాచారం. గులామ్ అహ్మద్ మిర్ పోటీ చేస్తున్న దూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తారని కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ స్థానిక నేషనల్ కాన్ఫరెన్స్‌తో పొత్తు పెట్టుకుంది. 90కి గాను 32 చోట్ల పోటీ చేస్తోంది. ఇప్పటికే తొమ్మిది మందితో తొలి జాబితా విడుదల చేసింది.
Similar News
News September 19, 2024
జమిలికి గ్రీన్ సిగ్నల్.. ఎన్నికలు ఎప్పుడంటే?
జమిలి ఎన్నికలను కేంద్రం ఆమోదించడంతో ఎన్నికలు ఎప్పుడొస్తాయనే ప్రశ్న నెలకొంది. ఈ విధానం 2029 నుంచి అమల్లోకి రానుందని సమాచారం. అప్పుడు లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే దేశంలోని 17 రాష్ట్రాల్లో 2026, 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 2029లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు రెండు, మూడేళ్లే అధికారంలో ఉంటాయి.
News September 19, 2024
తరగతి గదిలోకి టీచర్లు ఫోన్ తీసుకెళ్తే కఠిన చర్యలు
TG: క్లాస్ రూమ్‌లోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లొద్దనే ఆదేశాలున్నా కొందరు టీచర్ల తీరు మారట్లేదు. ఇటీవల కలెక్టర్ల ఆకస్మిక తనిఖీల్లో పలువురు ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌లోనే సమయం గడుపుతూ కనిపించారు. దీంతో విద్యాశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తరగతి గదిలోకి ఫోన్ తీసుకెళ్లొద్దని, అత్యవసరమైతే HM అనుమతి తీసుకోవాలని పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
News September 19, 2024
కౌలు రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
AP: కౌలు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూయజమాని సంతకం లేకుండానే వచ్చే రబీ నాటికి కౌలు కార్డులను ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. దీనివల్ల కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా పంట రుణాలు ఇప్పించడం, ప్రభుత్వ సబ్సిడీలు, పరిహారాలు అందించడం మరింత సులువవుతుంది. అదే సమయంలో రైతుల భూమి హక్కులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోనుంది. వారిలో ఉన్న అపోహలు తొలగించనుంది.