News July 28, 2024
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై రాహుల్ ఫైర్
ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా కోచింగ్ సెంటర్‌లోకి వరద పోటెత్తి ముగ్గురు అభ్యర్థులు <<13723684>>మృతి<<>> చెందడం దురదృష్టకరమని ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భద్రత లేని నిర్మాణం, ప్రభుత్వ సంస్థల బాధ్యతారాహిత్యానికి సామాన్యులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రతి ఒక్క పౌరుడికి సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితం అందించడం ప్రభుత్వాల బాధ్యత అని Xలో పేర్కొన్నారు.
Similar News
News December 10, 2024
ఏలూరు ఘటనపై బాలల హక్కుల కమిషన్ ఆగ్రహం
AP: ఏలూరులోని ఓ మిషనరీ సంస్థ హాస్టల్‌లో ఇంటర్ బాలిక ప్రసవం, <<14828392>>బిడ్డను విసిరేయడంపై<<>> రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మండిపడింది. ఈ ఘటనపై 3 రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని ఆధారంగా బాధ్యులపై చర్యలకు సిఫారసు చేస్తామని తెలిపింది. హాస్టల్ పిల్లలపై సిబ్బంది, పేరెంట్స్ పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందంది.
News December 10, 2024
ఆర్జీవీ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
AP: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై అసభ్యకర పోస్టులు చేశారనే ఆరోపణలతో ఆర్జీవీపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. వీటిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను శుక్రవారం వరకు పొడిగించింది.
News December 10, 2024
వచ్చే వారం పోలవరంలో సీఎం పర్యటన
AP: సీఎం చంద్రబాబు వచ్చేవారం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన టైమ్ షెడ్యూల్‌ను విడుదల చేస్తారని తెలిపారు. జనవరి నుంచి డయాఫ్రం వాల్ పనులు మొదలవుతాయన్నారు. దానికి సమాంతరంగా ఎర్త్ కం రాక్ ఫిల్లింగ్ పనులు కూడా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పునరావాస పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.