News April 2, 2025
పార్లమెంట్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ

లోక్‌సభలో వక్ఫ్ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. LOP రాహుల్ గాంధీ ఇప్పుడే పార్లమెంట్‌కు చేరుకున్నారు. కాగా బిల్లు విషయంలో కేంద్రం తొందరపాటుతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ దుయ్యబట్టారు. సరైన చర్చ లేకుండానే బిల్లు పాస్ చేయాలని చూస్తోందన్నారు. తమకు మాట్లాడేందుకు సరిపడా సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు. మరోవైపు కేంద్ర మంత్రి రిజిజు విపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు.
Similar News
News December 9, 2025
IndiGo: నెట్వర్క్ పునరుద్ధరణ.. నేడు 250 సర్వీసులు రద్దు!

ఇండిగో సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. తాజాగా నెట్‌వర్క్‌ను పూర్తిగా పునరుద్ధరించినట్లు సంస్థ ప్రకటించింది. అయినా దేశవ్యాప్తంగా నేడు 250కిపైగా సర్వీసులు రద్దు అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రయాణికుల ఖాతాల్లో రూ.827 కోట్లు రీఫండ్ చేసినట్లు పేర్కొంది. గోవా, అహ్మదాబాద్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. అటు తెలుగు రాష్ట్రాల్లోని HYD, విశాఖలో ఇవాళ పలు సర్వీసులు రద్దయ్యాయి.
News December 9, 2025
స్టార్ బ్యాటర్ అంజుమ్ చోప్రా గురించి తెలుసా?

ప్రస్తుతం స్పోర్ట్స్ యాంకర్‌గా ఉన్న అంజుమ్ చోప్రా గతంలో భారత జట్టులో కీలకపాత్ర పోషించారు. 18 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన ఈ దిల్లీ క్రికెటర్ IND తరఫున 100 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. స్టార్ బ్యాటర్ అయిన ఆమె నాలుగు ప్రపంచ కప్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. మొత్తం మీద 127 వన్డేలు, 12 టెస్టులు, 18 టీ20లు ఆడారు. 2007లో అర్జున అవార్డు, 2014 పద్మశ్రీ అందుకున్నారు.
News December 9, 2025
పూజాగదిలో తప్పనిసరిగా నీళ్లు ఎందుకు ఉండాలి?

పూజా గదిలో ఏదైనా ఓ పాత్రలో నీటిని తప్పక ఉంచాలని పండితులు సూచిస్తారు. తద్వారా దేవతలు సంతృప్తి చెందుతారని అంటారు. ‘మహా నైవేద్యం కంటే కూడా నీటిని ఉంచి ప్రార్థించడం ద్వారా దేవతలు ఎక్కువ సంతోషిస్తారు. రాగి చెంబులో ఉంచిన మంచి నీరు మంత్ర శక్తి చేరిన జలంతో సమానం. ఆ నీరు ఆరోగ్యం, ఆనందాన్ని ఇస్తుంది. ఈ నీటిని రెండ్రోజులకోసారి మార్చాలి. ఫలితంగా ఇంట్లో రుణ శక్తి దూరమై, దైవశక్తి పెరుగుతుంది’ అని చెబుతున్నారు.


