News April 2, 2025
పార్లమెంట్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ

లోక్‌సభలో వక్ఫ్ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. LOP రాహుల్ గాంధీ ఇప్పుడే పార్లమెంట్‌కు చేరుకున్నారు. కాగా బిల్లు విషయంలో కేంద్రం తొందరపాటుతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ దుయ్యబట్టారు. సరైన చర్చ లేకుండానే బిల్లు పాస్ చేయాలని చూస్తోందన్నారు. తమకు మాట్లాడేందుకు సరిపడా సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు. మరోవైపు కేంద్ర మంత్రి రిజిజు విపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు.
Similar News
News April 21, 2025
భార్య కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్.. కట్ చేస్తే..

UPలోని అలీగఢ్‌కు చెందిన షకీర్(40) అనే వ్యక్తి తన భార్య అంజుమ్, నలుగురు పిల్లలు ఈ నెల 15 నుంచి కనిపించడం లేదంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకూ వారి ఆచూకీ లభించలేదు. తాజాగా షకీర్ బంధువులకు ఆమె తాజ్‌మహల్ వద్ద మరో వ్యక్తితో కలిసి కనిపించింది. వారు వాట్సాప్‌లో వీడియో పంపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి తెలిసినవాడేనని, తన భార్యను తన వద్దకు చేర్చాలని షకీర్ అధికారుల్ని కోరాడు.
News April 21, 2025
IPL: ముంబై సునాయాస విజయం

చెన్నై చాలా కష్టంగా చేసిన 176 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఉఫ్‌మని ఊదేసింది. రోహిత్ హాఫ్ సెంచరీ(76*)తో ఫామ్‌లోకి రాగా అటు సూర్య కూడా తనదైన శైలిలో అర్ధ శతకం(68*) చేయడంతో 16వ ఓవర్లోనే MI టార్గెట్‌ను ఛేదించింది. చెన్నై బౌలర్లలో జడేజాకు మాత్రమే వికెట్ దక్కింది. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
News April 20, 2025
‘నాలా ఎవరూ మోసపోవద్దు’ అంటూ ఆత్మహత్య

AP: ఆన్‌లైన్ గేమ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి(మ) పైడేటికి చెందిన జయ చంద్ర కొన్నేళ్లుగా ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై అప్పులపాలయ్యాడు. ఆ బాధను తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దు. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవద్దు. నాలాగా మోసపోవద్దు’ అని షర్టుపై రాసుకొని మరీ సూసైడ్ చేసుకున్నాడు. జయ చంద్ర డిగ్రీ చదివి, వ్యవసాయం, పాల వ్యాపారం చేస్తున్నాడు.