News September 27, 2024
డిఫెన్స్ స్టాండింగ్ కమిటీలోకి రాహుల్ గాంధీ
మినిస్ట్రీల పనితీరుపై దృష్టిపెట్టే పార్లమెంటు స్టాండింగ్ కమిటీలు ఏర్పాటైనట్టు రాజ్యసభ సెక్రటేరియట్ తెలిపింది. రాధామోహన్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ కమిటీలో రాహుల్ గాంధీకి చోటు దక్కింది. సోనియా ఎందులోనూ లేరు. ఫైనాన్స్‌ను భర్తృహరి, విదేశాంగను శశి థరూర్ నడిపిస్తారు. TDP, JDU, శివసేన, NCPకి ఒక్కో కమిటీలో నాయకత్వం దక్కింది. అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, పంచాయితీ రాజ్‌కు కాంగ్రెస్ నేతలే సారథులు.
Similar News
News December 21, 2024
పెన్షన్లు 50% తగ్గించాలని చూస్తున్నారు: అంబటి
AP: పథకాల్లో కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ‘పెన్షన్లు 50% తగ్గించాలని చూస్తున్నారు. ప్రభుత్వం సంగతి 6 నెలల్లోనే ప్రజలకు తెలిసిపోయింది. కొందరు పార్టీలు పెట్టి మరో దాంట్లో కలిపేశారు. ఇంకొకరు పార్టీ పెట్టి మరొకరికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ జగన్ అలా కాదు. కష్టమైనా, నష్టమైనా, అన్యాయంగా జైల్లో పెట్టినా ప్రజల కోసం అన్నింటినీ ఎదుర్కొన్నారు’ అని చెప్పారు.
News December 21, 2024
పాతబస్తీలో చ.గజానికి రూ.81వేలు ఇస్తున్నాం: ఎన్వీఎస్ రెడ్డి
TG: పాతబస్తీలో మెట్రో పనులు శరవేగంగా జరుగుతున్నాయని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. విస్తరణపై ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలు రచిస్తోందని, త్వరలోనే సీఎం పూర్తి వివరాలు వెల్లడిస్తారని చెప్పారు. పాతబస్తీలో మెట్రో మార్గం కోసం 1100 ఆస్తులను సేకరిస్తున్నామని, చదరపు గజానికి రూ.81వేలు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే నిర్వాసితులకు చెక్కులు ఇచ్చి, నిర్మాణాలను తొలగిస్తామని వెల్లడించారు.
News December 21, 2024
పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ నటి
ఇటీవల ముగిసిన బిగ్‌బాస్ సీజన్-8తో పాపులర్ అయిన నటి సోనియా ఆకుల వివాహం చేసుకున్నారు. తన ప్రియుడి యశ్‌తో ఇవాళ తెల్లవారుజామున ఆమె పెళ్లి జరిగింది. ఈ వేడుకకు బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో పాటు ఇతర నటులు హాజరయ్యారు. తెలంగాణలోని మంథనికి చెందిన సోనియా ఆర్జీవీ తెరకెక్కించిన రెండు చిత్రాల్లో నటించారు. దీంతో ఆమెకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.