News February 16, 2025

రాహుల్ గాంధీది బ్రాహ్మణ కుటుంబం: జగ్గారెడ్డి

image

TG: రాహుల్ గాంధీ కులంపై ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బదులిచ్చారు. రాహుల్‌ది బ్రాహ్మణ కుటుంబమని, వారు హిందువులని పేర్కొన్నారు. సోనియాను ఉద్దేశించి హిందూ ధర్మం ప్రకారం భర్త మతమే భార్యకు వస్తుందని చెప్పారు. బీజేపీ నేతలు చేసే విమర్శల్లో కొన్నయినా వాస్తవాలు ఉండాలని హితవు పలికారు. నెహ్రూ కుటుంబం కులమతాలకు అతీతంగా పని చేసిందని తెలిపారు.

Similar News

News December 7, 2025

నేటి ముఖ్యాంశాలు

image

✸ జగన్‌కు దేవుడంటే లెక్కలేదు: సీఎం చంద్రబాబు
✸ TGపై పవన్ వ్యాఖ్యలు సరికాదు: ఉండవల్లి
✸ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రత్యేక విమానాలు: భట్టి
✸ కొడుకు, అల్లుడు, బిడ్డే KCRను ముంచుతారు: రేవంత్
✸ రూపాయి తన స్థాయిని తానే కనుగొంటుంది: నిర్మల
✸ 95% ఫ్లైట్ కనెక్టివిటీని పునరుద్ధరించాం: ఇండిగో
✸ దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన టీమ్ ఇండియా

News December 7, 2025

రెండు మూడేళ్లుగా ఇలా ఆడలేదు: కోహ్లీ

image

ఇటీవలికాలంలో తాను ఈ తరహాలో ఆడలేదని విరాట్ కోహ్లీ తెలిపారు. ‘ఈ సిరీస్‌లో ఆటతో సంతృప్తిగా ఉన్నాను. నిజాయతీగా చెప్పాలంటే గడిచిన రెండు మూడేళ్లలో ఈ విధంగా ఆడలేదు. 15-16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో కొన్నిసార్లు మన సామర్థ్యంపై అనుమానం కలుగుతుంది. మిడిల్ ఆర్డర్‌లో ఇలా ఆడితే జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలుసు’ అని కోహ్లీ చెప్పారు. కాగా SAపై కోహ్లీ రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో అదరగొట్టారు.

News December 7, 2025

ఇండిగోకి DGCA షోకాజ్ నోటీసులు

image

ఇండిగో సర్వీసుల్లో ఏర్పడిన గందరగోళంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థ CEO పీటర్ ఎల్బర్స్‌, మేనేజర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా సమాధానమివ్వాలని పేర్కొంది. లార్జ్ స్కేల్ క్యాన్సిలేషన్స్, ప్లానింగ్‌లో వైఫల్యం, నిర్లక్ష్యం వంటి అంశాలను నోటీసుల్లో ప్రస్తావించింది. ఈ విషయంలో ఇండిగో సంస్థపై కఠిన చర్యలు ఉంటాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.