News February 16, 2025
రాహుల్ గాంధీది బ్రాహ్మణ కుటుంబం: జగ్గారెడ్డి

TG: రాహుల్ గాంధీ కులంపై ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బదులిచ్చారు. రాహుల్‌ది బ్రాహ్మణ కుటుంబమని, వారు హిందువులని పేర్కొన్నారు. సోనియాను ఉద్దేశించి హిందూ ధర్మం ప్రకారం భర్త మతమే భార్యకు వస్తుందని చెప్పారు. బీజేపీ నేతలు చేసే విమర్శల్లో కొన్నయినా వాస్తవాలు ఉండాలని హితవు పలికారు. నెహ్రూ కుటుంబం కులమతాలకు అతీతంగా పని చేసిందని తెలిపారు.
Similar News
News March 19, 2025
2008 నుంచి IPL ఆడుతున్న వారు వీరే

ఇప్పటివరకు ఐపీఎల్‌లో వేలాది మంది క్రికెటర్లు ఆడారు. కానీ కొందరు మాత్రమే ఆరంభ సీజన్ నుంచి రాబోయే సీజన్‌లో కూడా ఆడబోతున్నారు. వీరిలో స్వప్నిల్ సింగ్, అజింక్య రహానే, మనీశ్ పాండే, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటికీ ఆడుతున్నారు. అందరూ భారతీయులే కావడం విశేషం. మరోసారి తమ ప్రదర్శనతో అలరించడానికి వీరు సిద్ధమవుతున్నారు.
News March 19, 2025
విడాకుల వార్తలు.. హీరోయిన్ ఏమన్నారంటే?

భర్తతో విడాకులు తీసుకోనున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని హీరోయిన్ భావన ఖండించారు. ‘పర్సనల్ విషయాలను, భర్తతో దిగిన ఫొటోలను నేను సోషల్ మీడియాలో పోస్టు చేయను. అందుకే మేం విడిపోతున్నామని అనుకుంటున్నారు. కానీ మేం సంతోషంగా ఉన్నాం’ అని తెలిపారు. ఈమె తెలుగులో ఒంటరి, మహాత్మా, హీరో చిత్రాల్లో హీరోయిన్‌గా చేశారు. పలు భాషల్లో దాదాపు 70 చిత్రాల్లో నటించారు. 2018లో కన్నడ నిర్మాత నవీన్‌ను పెళ్లి చేసుకున్నారు.
News March 19, 2025
రైళ్లపై 7,971 రాళ్ల దాడులు: అశ్వినీ వైష్ణవ్

2023 నుంచి ఈ ఏడాది FEB వరకు వందేభారత్ సహా ఇతర రైళ్లపై 7,971 రాళ్ల దాడి ఘటనలు జరిగినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ కేసుల్లో 4,549 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. దాడుల్లో దెబ్బతిన్న రైళ్ల మరమ్మతులకు రూ.5.79 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలను నియంత్రించేందుకు GRP, జిల్లా పోలీసులతో కలిసి RPF పనిచేస్తోందన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు.