News August 10, 2024

రాహుల్‌కు రైతుల్ని పట్టించుకొనే టైమ్ లేదు: BJP

image

వంచిత రాజకీయాలకు రాహుల్ ప్రతిరూపంగా మారారని BJP నేత గౌరవ్ భాటియా విమర్శించారు. తాము మోసపోయినట్టు కర్ణాటక, హిమాచల్ ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. ‘KA ఎన్నికల్లో ఇచ్చిన 59 హామీల్లో 2 నెరవేర్చారు. రాష్ట్రంలో 1200 మంది రైతులు సూసైడ్ చేసుకున్నట్టు కథనాలు వచ్చాయి. బాధితుల్ని కలిసేందుకు లేదా కనీసం సమస్యను CM దృష్టికి తీసుకొచ్చే టైమ్ రాహుల్‌కు లేదు. ఎందుకంటే ఆయన ప్రాధామ్యాలు వేరు’ అని అన్నారు.

Similar News

News November 19, 2025

50 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం: లడ్డా

image

AP: రాష్ట్రంలో ఇప్పటివరకు 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు. ‘ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అరెస్టులు జరిగాయి. భారీగా ఆయుధాలు కూడా సీజ్ చేశాం. నిన్న మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోయారు. ఛత్తీస్‌గఢ్/తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు’ అని తెలిపారు.

News November 19, 2025

భూపాలపల్లి: నేడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు లక్కీ డ్రా

image

భూపాలపల్లిలో డబుల్ బెడ్ రూమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈరోజు సింగరేణి ఇల్లందు క్లబ్‌లో రెండు పడక గదుల ఇళ్లు కేటాయింపునకు డ్రా పద్దతి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొననున్నారు. లబ్ధిదారులకు డ్రా పద్ధతిలో కేటాయిస్తారు.

News November 19, 2025

కాజీపేట నుంచి దర్భంగాకు నేడు స్పెషల్ ట్రైన్

image

కాజీపేట మీదుగా దర్భంగా స్పెషల్ రైలు బుధవారం నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి- దర్భంగా మధ్య నడిచే ఈ ప్రత్యేక రైలు(07999) కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్ష, గోండియా, రాయపూర్, బిలాస్‌పూర్, రాంచి సహా పలు స్టేషన్లలో ఆగనుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఈ రైలును నడుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.