News January 12, 2025

రాహుల్ జీ.. గొప్ప మార్గంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నారు: KTR

image

TG: సంక్రాంతి తర్వాత మరింత మంది BRS MLAలు కాంగ్రెస్‌లో చేరతారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై KTR స్పందించారు. ‘ఓవైపు HYDలో జరిగే సంవిధాన్ బచావో(రాజ్యాంగాన్ని కాపాడండి) ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొంటారని అంటున్నారు. మరోవైపు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి BRS MLAలను చేర్చుకుంటామని TPCC చీఫ్ చెబుతున్నారు. రాహుల్ జీ.. మీరు గొప్ప మార్గంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నారు’ అని సెటైరికల్ ట్వీట్ చేశారు.

Similar News

News January 21, 2026

పొట్టేళ్లకు ఎండు మేత చాలా ముఖ్యం

image

పొట్టేళ్ల పెంపకంలో పచ్చి మేత కంటే ఎండు మేతే చాలా ముఖ్యమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ పొట్టు, ఉలవ పొట్టు, కంది పొట్టు వంటి చాలా రకాల ఎండు మేతలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొట్టేళ్లు చాలా ఇష్టంగా తింటాయి. దీని వల్ల అవి చాలా ఆరోగ్యంగా ఉంటూ, ఎక్కువ బరువు పెరుగుతాయి. అందుకే పచ్చిమేత కాస్త తక్కువైనా, ఎండు మేతను వెటర్నరీ నిపుణుల సూచనలతో సరైన పరిమాణంలో అందేలా చూసుకోవాలి.

News January 21, 2026

మేడారం నుంచి నిమిషానికి 4 బస్సులు: పొన్నం

image

TG: మేడారం నుంచి భక్తులు ఇళ్లకు చేరేందుకు నిమిషానికి 4 బస్సులు ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘జాతరకు RTC బస్సుల్లో 20 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. రద్దీకి తగ్గట్లు 4వేల ప్రత్యేక బస్సులు నడపనున్నాం. 50 ఎకరాల్లో ఒకేసారి 1000 బస్సులు నిలిపేలా ఏర్పాటు చేశాం. బస్సులు మేడారం నుంచి వచ్చేటప్పుడు ఖాళీగా ఉంటాయనే 50% అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నాం’ అని స్పష్టం చేశారు.

News January 21, 2026

ఊటనేల దున్నినా, మట్టి పిసికినా, ఫలితం బురదే

image

ఊటనేల ఎప్పుడూ నీరు ఊరుతూ ఉండే, సహజంగానే చిత్తడిగా ఉండే భూమి. ఆ నేలలో ఎంత కష్టపడి నాగలితో దున్నినా లేదా చేతులతో మట్టిని పిసికి గట్టి పరచడానికి ప్రయత్నించినా దాని స్వభావం మారదు. చివరికి మిగిలేది గట్టిపడని, వ్యవసాయానికి పనికిరాని బురద మాత్రమే. కొన్నిసార్లు కొందరి మనుషుల స్వభావాన్ని ఎంత మార్చాలని ప్రయత్నించినా అవి మారవు. దాని వల్ల మన శ్రమే వృథా అవుతుందని ఈ సామెత చెబుతుంది.