News January 12, 2025
రాహుల్ జీ.. గొప్ప మార్గంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నారు: KTR

TG: సంక్రాంతి తర్వాత మరింత మంది BRS MLAలు కాంగ్రెస్‌లో చేరతారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై KTR స్పందించారు. ‘ఓవైపు HYDలో జరిగే సంవిధాన్ బచావో(రాజ్యాంగాన్ని కాపాడండి) ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొంటారని అంటున్నారు. మరోవైపు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి BRS MLAలను చేర్చుకుంటామని TPCC చీఫ్ చెబుతున్నారు. రాహుల్ జీ.. మీరు గొప్ప మార్గంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నారు’ అని సెటైరికల్ ట్వీట్ చేశారు.
Similar News
News February 17, 2025
నేడు తిరుపతిలో దేవాలయాల సమ్మిట్.. ముగ్గురు సీఎంల హాజరు

AP: తిరుపతిలో నేటి నుంచి 3 రోజులపాటు అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఇవాళ ఏపీ, మహారాష్ట్ర, గోవా సీఎంలు చంద్రబాబు, ఫడణవీస్, ప్రమోద్ సావంత్, కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పాల్గొననున్నారు. వీరు ఇంటర్నేషనల్ టెంపుల్ ఎక్స్‌పోను ప్రారంభిస్తారు. ఎక్స్‌పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్‌షాపులు జరుగుతాయి. దాదాపు 100 ఆలయాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు.
News February 17, 2025
నేటి నుంచి GOVT స్కూల్ విద్యార్థులకు కంటి పరీక్షలు

TG: GOVT పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నేటి నుంచి కంటి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రెండు విడతలుగా 89,245మందికి పైగా చిన్నారులకు గత ఏడాది పరీక్షలు ముగిశాయి. వారిలో 88,676మందిలో దృష్టిలోపాలున్నాయని అధికారులు గుర్తించారు. ఇక ఈరోజు నుంచి వచ్చే నెల 5 వరకూ మూడో విడత పరీక్షలు ప్రారంభం జరగనున్నాయి. సమస్య ఎక్కువగా ఉన్న పిల్లలకు కళ్లజోళ్లను అందివ్వనున్నారు.
News February 17, 2025
26.77 కోట్ల ‘ఉపాధి’ పనిదినాలు కేటాయించండి: కేంద్రంతో ఏపీ

AP: ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025-26 ఏడాదికి APకి 26.77 కోట్ల పనిదినాల్ని కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ అధికారుల బృందంతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శైలేశ్ కుమార్‌ను ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలో భారీగా పెరిగిన కూలీల సంఖ్యకు తగ్గట్టుగా కేటాయింపులు పెంచాలని కోరారు. ఈ మేరకు ప్రతిపాదనలను ఆయనకు సమర్పించారు.