News January 11, 2025
27న తెలంగాణకు రాహుల్, ఖర్గే
TG: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ నెల 27న రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సంవిధాన్ బచావో’ కార్యక్రమంలో వారు పాల్గొంటారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ తదితర కార్యక్రమాలను కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే.
Similar News
News January 11, 2025
వైసీపీ హయాంలో పోలవరం ధ్వంసం: రామానాయుడు
AP: పోలవరం ప్రాజెక్టును YCP సర్కార్ 20 ఏళ్లు వెనక్కి నెట్టిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఏడాదిన్నర కష్టపడి డయాఫ్రం వాల్ నిర్మిస్తే YCP దానిని ధ్వంసం చేసిందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన పార్లమెంటరీ కమిటీకి ఆయన స్వాగతం పలికారు. 2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టు 72 శాతం పనులు పూర్తి చేశామన్నారు. సీఎం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే పోలవరాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
News January 11, 2025
ప్రధాని మోదీ యూట్యూబ్ సంపాదన ఎంతంటే?
ప్రధాని నరేంద్ర మోదీకి అధికారిక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆయన చేపట్టే అన్ని ప్రారంభోత్సవాలు, అధికారిక కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు ఇందులో ప్రసారమవుతాయి. ఈ ఛానల్కు 26 మిలియన్లకుపైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పటివరకు ఆయన 29,272 వీడియోలు పోస్ట్ చేశారు. వీటికి మొత్తంగా 636 కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి. ఓ నివేదిక ప్రకారం ఈ ఛానల్ ద్వారా మోదీకి నెలకు రూ.1.62 కోట్ల నుంచి రూ.4.88 కోట్ల ఆదాయం వస్తోంది.
News January 11, 2025
ఆ వ్యూహాత్మక ప్రాంతాల్లో సైన్యం బలోపేతమే లక్ష్యం.. భారత్ కీలక నిర్ణయాలు
లద్దాక్ ప్రాంతంలో చైనా సరిహద్దుల్లో ఉన్న వ్యూహాత్మక ప్రాంతాల్లో భారత సైన్యం మరింత బలోపేతం కానుంది. అక్కడ రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్లైఫ్ (NBWL) 11 కీలక ప్రాజెక్టులను ఆమోదించింది. టెలికం నెట్వర్క్ ఏర్పాటు, మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రాలు, ఇన్ఫ్యాంట్రీ బెటాలియన్ శిబిరాలు, ఆర్టిలరీ రెజిమెంట్ పోస్టుల ఏర్పాటు తదితర ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.