News December 19, 2024

రాహుల్ నాతో అసభ్యంగా ప్రవర్తించారు: మహిళా ఎంపీ ఫిర్యాదు

image

పార్లమెంటు తోపులాట వ్యవహారంలో BJP, కాంగ్రెస్ MPలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. రాహుల్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని BJP మహిళా MP ఫాంగ్నాన్ కొన్యాక్ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు ఫిర్యాదు చేశారు. ‘నా గౌరవ మర్యాదలు, సెల్ఫ్ ఎస్టీమ్‌ను రాహుల్ గాంధీ గాయపరిచారు’ అని పేర్కొన్నారు. BJP MPలు తోసేయడం వల్ల సర్జరీ చేయించుకున్న మోకాలికి గాయమైందని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు.

Similar News

News January 24, 2025

ముగిసిన TG CM రేవంత్ దావోస్ పర్యటన

image

దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. అక్కడ జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు-2025లో పాల్గొన్న ఆయన ఈ ఉదయం 10.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ బృందం దావోస్ పర్యటన సాగింది. ఈ సందర్భంగా సీఎంకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు విమానాశ్రయానికి వెళ్లనున్నాయి.

News January 24, 2025

గ్రామాలకు మహర్దశ.. రోడ్ల నిర్మాణానికి రూ.2,773 కోట్లు మంజూరు

image

TG: ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ఉండాలన్న CM రేవంత్ రెడ్డి <<15058155>>ఆదేశాల<<>> నేపథ్యంలో ప్రభుత్వం రూ.2,773కోట్లు మంజూరు చేసింది. గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.1,419కోట్లు, మరమ్మతులకు రూ.1,288కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం అమలు చేసే ‘పీఎం జన్‌మన్’ పథకానికి రాష్ట్ర వాటాగా రూ.66కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. గ్రామీణ రోడ్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే తొలిదశలో రూ.2,682కోట్లు విడుదల చేసింది.

News January 24, 2025

దిల్‌ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

image

TG: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో గురువారం అర్ధరాత్రి ఐటీ సోదాలు ముగిశాయి. మూడు రోజుల పాటు ఐటీ అధికారులు ఆయన ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. దిల్ రాజు‌తో పాటు ఆయన సోదరుడు శిరీష్, కూతురు హన్షితరెడ్డి, బంధువుల నివాసాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సోదాల నేపథ్యంలో ఆయన తల్లి అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.